Ajith: వాళ్ళకి పెద్ద షాకిచ్చిన అజిత్..ఏమైందంటే?

2025 సంక్రాంతికి 3 పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అవే ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) సినిమాలు. వీటితో పాటు అజిత్ (Ajith) తెలుగు నిర్మాతలు అయిన ‘మైత్రి’ వారితో చేస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కూడా రిలీజ్ అవుతుందని ప్రకటన వచ్చింది. కానీ సకాలంలో షూటింగ్ కంప్లీట్ అవ్వకపోవడం వల్ల, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావడం ఇష్టం లేక ఈ సినిమాను సంక్రాంతి రేస్ నుండి తప్పించినట్టు చెన్నైలో జరిగిన ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) ఈవెంట్లో ‘మైత్రి’ నవీన్ (Naveen Yerneni)  చెప్పుకొచ్చారు.

Ajith

దీంతో సంక్రాంతికి అజిత్ (Ajith) సినిమా లేనట్టే అని అంతా అనుకున్నారు. దీంతో తెలుగులో ఇంకో సినిమాను విడుదల చేయాలని చూస్తున్న నిర్మాతలు కూడా ఉన్నారు. ఇలాంటి టైంలో అజిత్ ఇంకో ట్విస్ట్ ఇచ్చినట్టు అయ్యింది. అజిత్ నటించిన ‘విడాముయ‌ర్చి’ అనే మరో సినిమా సంక్రాంతి బరిలోకి దిగనుంది. లైకా ప్రొడ‌క్షన్స్ బ్యానర్లో రూపొందిన ఈ చిత్రానికి మ‌గిళ్ తిరుమేని దర్శకుడు. త్రిష (Trisha), అర్జున్ (Arjun Sarja) , రెజీనా (Regina Cassandra) వంటి స్టార్స్ ఈ సినిమాలో నటించారు.

తాజాగా టీజ‌ర్‌ను కూడా వదిలారు. ఇందులో యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. అనిరుథ్ (Anirudh Ravichander) సంగీతం స్పెషల్ గా అనిపిస్తుంది. సో ‘విడాముయ‌ర్చి’ సంక్రాంతికి తమిళంలో గట్టిగా క్యాష్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి మొదట ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంతగా ఆసక్తి లేదు. చాలా కాలంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. కానీ సడన్ గా టీజర్ రిలీజ్ చేసి హైప్ పెంచారు. కానీ తెలుగులో ఈ సినిమా పెద్దగా ఇంపాక్ట్ చూపకపోవచ్చు. సో తెలుగులో ఇంకో చిన్న సినిమా విడుదల చేసుకున్న ఇబ్బంది ఉండకపోవచ్చు.

 ‘పుష్ప 2’ అభిమానులకి ఆ ముచ్చట తీరుతుందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus