Pushpa 2 The Rule: ‘పుష్ప 2’ అభిమానులకి ఆ ముచ్చట తీరుతుందా?

కోవిడ్ తర్వాత వస్తున్న పెద్ద సినిమాలకి రెండేసి ట్రైలర్లు రిలీజ్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ‘భీమ్లా నాయక్’ (Bheenla Nayak) ‘రాధే శ్యామ్’ (Radhe Shaym) ‘సలార్'(పార్ట్ 1 : సీజ్ ఫైర్) (Salaar) ‘ ‘కల్కి 2898 ad’  (Kalki 2898 AD)  ‘దేవర'(పార్ట్ 1) (Devara) వంటి సినిమాలకి రెండేసి ట్రైలర్లు విడుదల చేశారు. ఒకటి థియేట్రికల్ ట్రైలర్ పేరుతో.. ఇంకోటి రిలీజ్ ట్రైలర్ పేరుతో విడుదల చేస్తుండటం జరుగుతుంది. సో ‘పుష్ప 2’ (Pushpa 2 The Rule)  చిత్రానికి కూడా ఇంకో ట్రైలర్ విడుదల చేస్తారా? అనే ఆశ ఫ్యాన్స్ లో ఉంది.

Pushpa 2 The Rule

వాస్తవానికి ఇంకో ట్రైలర్ విడుదల చేయాలనే ఆలోచన సుకుమార్ (Sukumar)  అండ్ టీంకి కూడా ఉండేదట. థియేట్రికల్ ట్రైలర్ కోసం రెండు కట్స్ చేయించారు. అందులో ఒకటి బయటకు వచ్చింది.. ఇంకోటి అలా ఉంచారు. కానీ ‘పుష్ప 2’ కి కావాల్సినంత బజ్ వచ్చేసింది. పైగా రిలీజ్ కి మరో 5 రోజులు మాత్రమే టైం ఉంది.

ప్రీమియర్ షోలు వేస్తున్నారు కాబట్టి.. 4 రోజులు మాత్రమే టైం ఉన్నట్టు లెక్క. సో 4 రోజులకి ఇంకో ట్రైలర్ అవసరమా అనే ఆలోచన కూడా సుకుమార్ కి ఉంది. అయితే రన్ టైం విషయంలో మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. నిర్మాత ‘రన్ టైం పెద్ద సమస్య కాదు’ అని ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పినా..

3 గంటల 20 నిమిషాలు రన్ టైంకి ఫ్యామిలీ ఆడియన్స్ ఫిక్స్ అయ్యి థియేటర్స్ కి రావాలంటే, ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ కొన్ని విజువల్స్ కట్ చేసి రిలీజ్ ట్రైలర్ గా వదిలితే బెటర్ అనేది కొందరి అభిప్రాయం. మరి చిత్ర బృందం ఏం చేస్తుందో చూడాలి.

అనుష్క పాన్ ఇండియా సినిమా.. ఇంత సైలెంటుగానా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus