Ajith: డివైడ్ టాక్ తో కోట్లు రాబడుతోంది!

ఈ మధ్యకాలంలో కోలీవుడ్ లో స్టార్ హీరోలెవరూ కూడా సరైన హిట్టు సినిమాలు చేయలేదు. వారు నటిస్తోన్న సినిమాలన్నీ డివైడ్ టాక్ తెచ్చుకుంటున్నాయి. అయినప్పటికీ అభిమానులు ఆ సినిమాలతోనే సంతృప్తి చెందుతున్నారు. భారీ వసూళ్లు అందిస్తున్నారు. రజినీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిన ‘అన్నాత్తే’ సినిమా కూడా అక్కడ హిట్ అయిందంటే పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. రజినీకాంత్ తరువాత ఆ రేంజ్ ఉన్న హీరోలు విజయ్, అజిత్ ల నుంచి కూడా సరైన సినిమాలు రావడం లేదు.

గతేడాది అజిత్ నటించిన ‘వలిమై’ సినిమా చూసి మనోళ్లు పెదవి విరిచారు. కానీ అది తమిళనాట బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. అలానే ‘విశ్వాసం’ అనే రెగ్యులర్ కాన్సెప్ట్ సినిమాతో కోలీవుడ్ లో రికార్డులు నెలకొల్పారు అజిత్. ఇప్పుడు ‘తునివు’ సినిమాతోనూ అజిత్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా విజయ్ నటించిన ‘వరిసు’ సినిమాకి పోటీగా ‘తునివు’ సినిమా విడుదలైంది. దీనికి గొప్ప టాక్ ఏమీ రాలేదు. తెలుగులో అయితే ఈ సినిమాను ఎవరూ పట్టించుకోలేదు.

రివ్యూలు, టాక్ ఏమంత పాజిటివ్ గా రాలేదు. కోలీవుడ్ లో మాత్రం ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్. ‘వరిసు’ సినిమా మ్యాజిక్ చేయలేకపోతోంది కానీ ‘తునివు’ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. విజయ్ సినిమాతో పోలిస్తే.. తమిళనాడు మొత్తం అజిత్ సినిమా ఎక్కువ కలెక్షన్స్ రాబడుతోంది. తొలిరోజు నుంచి ‘తునివు’ సినిమా కలెక్షన్స్ లో ఎక్కడా డ్రాప్ కనిపించలేదు.

హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఒక్క తమిళనాడులో మాత్రమే ఈ సినిమా కలెక్షన్స్ రూ.100 కోట్లకు దగ్గరవుతున్నాయి. ఫుల్ రన్ లో ఈ సినిమా రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus