యువ హీరోలకు పోటీగా అజిత్ స్టన్నింగ్ లుక్
- December 22, 2016 / 12:44 PM ISTByFilmy Focus
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కొంతకాలంగా తన వయసుకు తగ్గ పాత్రలు చేసి విజయాలను అందుకున్నారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో అలరించిన ఆయన ఇప్పుడు రూట్ మార్చారు. తన కొత్త సినిమాలో స్టన్నింగ్ లుక్ తో అదరగొట్టేందుకు సిద్ధమయ్యారు. “తలా 57 ” అనే వర్కింగ్ టైటిల్ తో డైరక్టర్ శివ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో అజిత్ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఆయన సరసన కాజల్ అగర్వాల్, అక్షరా హాసన్ ఆడి పాడనున్నారు. ప్రస్తుతం బల్గెరియాలో షూటింగ్ జరుపుంటున్న ఈ మూవీలోని లేటెస్ట్ లుక్ ని నేడు సోషల్ మీడియా పేజ్ లో శివ పోస్ట్ చేశారు.
ఈ ఫొటోలో నీట్ షేవ్ చేసి, స్కిన్ టైట్ టీషర్ట్ లో కండలు తిరిగిన బాడీతో అజిత్ కనిపిస్తున్నారు. ఈ స్టిల్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఫైట్స్ భారీ స్థాయిలో ఉన్నట్లు ఈ ఫోటో చెప్పకనే చెప్పింది. అజిత్ అభిమానులు మాత్రం మరో హిట్ గ్యారంటీ అని ఆనందపడుతున్నారు. ఈ నెల చివరి వరకు హీరో అజిత్, విలన్వివేక్ ఒబరాయ్ లపై కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అనంతరం యూనిట్ ఇండియాకు తిరిగి రానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














