Akash Puri: ‘బుజ్జిగాడు’ గురించి ఆసక్తికర విషయం చెప్పిన ఆకాశ్‌!

‘బుజ్జిగాడు’ సినిమా చూశారా? అందులో చిన్ననాటి ప్రభాస్‌, త్రిషగా కనిపించింది ఎవరో మీకు తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోయుంటే వాళ్లపేర్లు ఆకాశ్‌, పవిత్ర. వాళ్ల యాక్టింగ్‌ సినిమాలో అదిరిపోయింది అని చెప్పాలి. చిన్నతనంలో అమ్మాయి, అబ్బాయి ఇష్టపడితే ఎలా ఉంటుంది, గొడవపడితే ఎలా ఉంటుంది అనేది బాగా చూపించారు. అయితే ఆకాశ్, పవిత్ర అన్నాచెల్లెళ్లు అనే విషయం తెలిసిందే. ఆ సినిమా సమయంలో వాళ్లను స్నేహితులు ఏమనేవారు అనేది ఆసక్తికరం. దీని గురించి ఇటీవల ఆకాశ్‌ చెప్పుకొచ్చాడు.

‘బుజ్జిగాడు’లో పవిత్ర, నువ్వు లవర్స్‌గా నటించారు కదా.. స్కూల్‌లో ఏమన్నారు అని అడిగితే… ఆ సమయంలో అందరూ కామెడీ చేసి నవ్వారు అని చెప్పాడు ఆకాశ్‌. అంతకంటే ముందే ఆకాశ్‌ వద్దనే చెప్పాడు. నాతో సినిమాలో పవిత్ర బాగోదని చెప్పాడట. కానీ పూరి జగన్నాథ్‌.. ఆకాశ్‌ మాట వినలేదట. పెద్దాయ్యాక నువ్వు నీ హీరోయిన్‌నే పెళ్లి చేసుకుంటావురా.. ఇప్పుడు ఈ సినిమాలో చెల్లితో నటించేయ్‌ అని అన్నారట. ఇది యాక్టింగ్‌.. ఇప్పుడు చేసేయ్‌ అన్నారట. అలా ‘బుజ్జిగాడు’లో అన్నాచెల్లెళ్లు లవర్స్‌గా నటించారట.

‘బుజ్జిగాడు’ సినిమా కంటే ముందే ఆకాశ్‌ ‘చిరుత’ సినిమాలో చిన్ననాటి రామ్‌చరణ్‌గా నటించాడు. ఆ సినిమా షో సమయంలో ఆకాశ్‌ను చూసి వాళ్ల అమ్మ ఏడ్చేశారట. ‘చిరుత’ సినిమాలో జైల్లో ఆకాశ్‌ గిన్నె పట్టుకొని వెళ్తుంటే లాగేయడం, అన్నం తినకుండా కొట్టేయడం లాంటి సీన్స్‌ చూసి తట్టుకోలేకపోయారట ఆకాశ్‌ తల్లి లావణ్య. ఆ సీన్స్‌ చూసి ఏడ్చేశారట.

‘నేనింతే’ సినిమాకు ఆకాశ్‌ ప్రొడక్షన్‌ బాయ్‌గా పని చేశాడట. సెట్‌లో ఉన్నప్పుడు కారవ్యాన్‌లోకి కూడా రావొద్దని కూడా చెప్పారట పూరి. అలా ఆ సినిమా సెట్‌లో రవితేజకు టీ ఇస్తే.. ‘ఏరా బాబూ నువ్వు టీలు ఇస్తావేంటీ…’ అంటూ ఒళ్లో కూర్చొబెట్టుకున్నారట’. అయితే రెండో రోజు మళ్లీ అదే పనికి పంపించారట పూరి జగన్నాథ్‌. అలా ఆ సినిమా సెట్‌లో ఓ రోజు ప్రొడక్షన్‌ బాయ్‌గా పని చేశారట.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus