రవితేజకు సినిమాల్లో ఇన్స్పిరేషన్ ఎవరు అంటే తెలుగులో చిరంజీవి, హిందీలో అమితాబ్ బచ్చన్ అని ఈజీగా చెప్పేయొచ్చు. ఈ విషయం రవితేజనే గతంలో చాలాసార్లు చెప్పారు. అంతగా ఆ ఇద్దరినీ ఆరాదిస్తుంటాడు రవితేజ. అందుకే గుర్తుగా చాలా సినిమాల్లో ఆ ఇద్దరు స్టార్లకు అభిమానిగా కనిపించి అలరించాడు కూడా. ఇప్పుడు ఆ పని చిన్న పూరి అదేనండి పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి చేయబోతున్నాడు. ఆకాశ్ పూరి సినిమాల్లోకి వచ్చి కొన్నేళ్లు అయినా సరైన ఫలితం మాత్రం దక్కడం లేదు.
వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం లేదు. ‘రొమాంటిక్’ అనే సినిమా ఒకటి విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే థియేటర్లలో విడుదల చేసేంత హైప్ సినిమాకు లేదు. పోనీ ఓటీటీలో విడుదల చేసేద్దాం అంటే… మనసు ఒప్పుకోవడం లేదు. ఆ సినిమా పక్కనపెడితే ‘చోర్ బజార్’ అని ఓ సినిమా చేస్తున్నాడు.ఆకాశ్ పుట్టిన రోజు సందర్భంగా ఇటీవల ‘చోర్ బజార్’ సినిమాకు సంబంధించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని, మోషన్ పోస్టర్ని ఇటీవల లాంచ్ చేశారు.
అందులో ఆసక్తికరంగా కనిపించే అంశాల్లో ఆకాశ్ చేతి మీద టాటూ ఒకటి. చేతిపై బచ్చన్ సాబ్ అనే పచ్చబొట్టు కనిపిస్తోంది. సినిమాల్లో బచ్చన్‌సాబ్ అంటే అమితాబ్ బచ్చనే. అంటే ఈ సినిమాలో ఆకాశ్ బచ్చన్ ఫ్యాన్‌గా కనిపిస్తాడుమరి.