ఆకాశ్‌ ఫ్యూచర్‌ ప్లాన్స్‌ మామూలుగా లేవుగా

ఎంతో మంది హీరోలకు స్ట్రగుల్‌ టైమ్‌లో సరైన హిట్ ఇచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్‌. అయితే తన ఇంటి హీరోలకు మాత్రం ఇంకా అలాంటి హిట్‌ ఇవ్వలేకపోతున్నారు. తమ్ముడు సాయిరామ్‌ శంకర్‌తో వరుస ప్రయత్నాలు చేసినా (చేయించినా) సరైన విజయం దక్కలేదు. ఇప్పుడు కొడుకు ఆకాశ్‌తో ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా అలాంటి ప్రయత్నం ‘రొమాంటిక్‌’. ఈ సినిమా ఎలా ఉంటుందో పక్కన పెడితే… హీరో ఆకాశ్‌ ఆలోచనలు మాత్రం సూపర్‌ ఉన్నాయి.

ఆకాశ్‌ గురించి కొన్ని రోజుల క్రితం పూరి జగన్నాథ్‌ చెబుతూ… ఇంటికి వచ్చే హీరోలను, నిర్మాతలను బాగా కాకా పడుతుంటాడు అని చెప్పారు. అవకాశాల కోసం తన ప్రయత్నం తాను చేస్తున్నాడని కూడా చెప్పారు. అలానే హీరో అయ్యాడు కూడా. కానీ సరైన సినిమా పడటం లేదు. అయితే ఓ పదేళ్ల తర్వాత దర్శకత్వం చేస్తా అంటున్నాడు ఆకాశ్‌. అప్పుడు వాళ్ల నాన్నకి రెమ్యునరేషన్‌ ఇచ్చి కథ తీసుకుంటాడట. బాగుంది కదా కాన్ఫిడెన్స్‌.

పూరి తన కొడుక్కి సరైన సినిమా ఎందుకు రాయడం లేదు, ఇవ్వలేకపోతున్నారు అని ఓవైపు అనుకుంటుంటే… ఆకాశ్‌ మాత్రం సరైన హిట్‌ కొట్టాక నాన్నతో సినిమా చేస్తా అంటున్నాడు. కెరీర్‌లో హీరోగా సక్సెస్‌ కొట్టాకే.. వెళ్లి నాన్నతో ఓ సినిమా చేస్తా అని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడు. అయితే అది ‘రొమాంటిక్‌’తోనా, లేక వేరే సినిమాతోనా అనేది తెలియదు అని చెప్పుకొచ్చాడు ఆకాశ్‌.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus