Akash Puri: ఆకాష్ ప్రేమించిన అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఒకరు. ఈయన వారసుడుగా ఆకాష్ పూరి కూడా బాల నటుడుగానే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆకాశ్ పలు సినిమాలలో బాలనటుడిగా నటించి ప్రస్తుతం హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే ఈయన హీరోగా నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవడం కోసం ఆకాష్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఆకాష్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈయన త్వరలోనే ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈయన తన చిన్నప్పటి క్లాస్మేట్ ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నారని వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

ఇప్పటికే వీరిద్దరి కుటుంబాలు కూడా వీరు పెళ్లికి అంగీకరించడంతో ఈ ఏడాది చివరిలోనే వీరి నిశ్చితార్థం జరగబోతుందని వచ్చే ఏడాదిలో పెళ్లి జరగబోతుందని తెలుస్తుంది. అయితే ఇప్పటికి వీరి పెళ్లి గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు. ఇక ఈయన ప్రేమించిన అమ్మాయి బ్యాక్గ్రౌండ్ మామూలుగా లేదని తెలుస్తుంది. ఒక పొలిటిషియన్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి అని తెలుస్తుంది.

ఈమె ఒక పొలిటికల్ సీనియర్ నేత మనవరాలు అని సమాచారం కొన్ని వందల కోట్లకు వారసురాలు అని తెలుస్తుంది. మరి పూరి ఆకాష్ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజము ఉందో తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి. అయితే వీరి ఫ్యామిలీ నుంచి అధికారక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి. ఇక ఈయన చివరిగా చోర్ బజార్ సినిమా ద్వార ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus