‘అఖండ 2′(Akhanda 2) ఈపాటికే షోలు పడిపోయి.. థియేటర్లలో మోత మోగిస్తూ ఉండాలి. దురదృష్టవశాత్తు అలాంటిదేమీ జరగలేదు.కారణం నిర్మాతలు లీగల్ ఇష్యూస్లో చిక్కుకోవడమే. ఎప్పుడో ‘1 నేనొక్కడినే’ ‘ఆగడు’ సినిమాలకి గాను ‘ఎరోజ్ ఇంటర్నేషనల్’ వారికి చెల్లించాల్సిన రూ.28 కోట్ల బకాయిలు చెల్లించకపోవడం వల్ల..అది వడ్డీలతో సహా పెరిగి ఇప్పుడు రూ.50 కోట్లు అయ్యింది.
నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట.. ఎక్కువ సినిమాలు నిర్మించే రకాలు కాదు. ఏ నాగవంశీనో, ‘మైత్రి’ రవి వంటి వారో అయితే.. వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నిర్మిస్తారు కాబట్టి.. ఫైనాన్షియర్స్ ఇంత కఠినంగా వ్యవహరించేవారు కాదు అనేది వాస్తవం. మరో చేదు నిజం ఏంటంటే..ఈ సినిమాకి బాలయ్య కుమార్తె తేజస్విని కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు.

ఆమె అయినా సీన్లోకి దిగి ఇష్యూ సాల్వ్ చేసే ప్రయత్నాలు చేయాలి. కానీ అలాంటిదేమీ చేయలేదు. తన తండ్రి బాలకృష్ణని ఒప్పించి ప్రాజెక్టు సెట్ చేసినందుకు ఆమె కమీషన్ ఆమె తీసుకుని సైడ్ అయిపోయారు అనేది ఇన్సైడ్ టాక్.సరే ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘అఖండ 2’ నిర్మాతలు ‘ఎరోజ్ ఇంటర్నేషనల్’ వారితో చర్చలు జరుపుతున్నారు. వడ్డీలు పక్కన పెట్టేసి.. ఇప్పటికిప్పుడు రూ.28 కోట్లు చెల్లించి, ఒక 125 ప్రామిసింగ్ నోట్లపై సంతకాలు పెడితే.. ‘రిలీజ్ కి అభ్యంతరాలు’ లేవు అని లెటర్ ఇస్తారు.
అది కోర్టులో సబ్మిట్ చేస్తే ఎన్.ఓ.సి వస్తుంది. అలా అని సమస్య పూర్తిగా తీరినట్టు కాదు. ‘ఎరోజ్..’ చూసి లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా తమకు ‘1 నేనొక్కడినే’ ‘ఆగడు’ సినిమాల నష్టపరిహారం చెల్లించాలని పట్టుబట్టి కూర్చున్నారు. వాళ్ళు కూడా లీగల్ నోటీసులు పంపారు. వాళ్లకి కూడా ఎంతో కొంత చెల్లించి సర్దిచెప్పాలి. ఇవి అన్నీ అనుకున్నట్టు జరిగితే.. ఈరోజు అనగా డిసెంబర్ 5 రాత్రి 8 గంటల షోతో ‘అఖండ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అదే జరగాలని అందరం కోరుకుందాం..!
