నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అనగానే అందరికీ ‘సింహా’ ‘లెజెండ్’ ‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలే గుర్తుకొస్తాయి. వీరి కాంబినేషన్లో ‘అఖండ 2’ కూడా రూపొందింది. ఈ సినిమాపై మొదటి నుండి ఇండస్ట్రీ వర్గాల్లో కానీ, ట్రేడ్ వర్గాల్లో కానీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాస్తవానికి డిసెంబర్ 5నే ఈ సినిమా రిలీజ్ కావాలి. కానీ ఆర్థిక లావాదేవీల కారణంగా వాయిదా పడింది.

మొత్తానికి అన్ని అడ్డంకులను తొలగించుకుని డిసెంబర్ 12న ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘అఖండ 2’. డిసెంబర్ 11 రాత్రి నుండి ప్రీమియర్ షోలు పడ్డాయి. ఈ విషయాలు పక్కన పెట్టేసి.. ‘అఖండ 2’ చిత్రానికి ఎంత థియేట్రికల్ బిజినెస్ జరిగిందో.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో వంటి వివరాలు ఓ లుక్కేద్దాం రండి :
| నైజాం | 20 cr |
| సీడెడ్ | 20 cr |
| ఉత్తరాంధ్ర | 10 cr |
| ఈస్ట్ | 7 cr |
| వెస్ట్ | 5 cr |
| గుంటూరు | 8 cr |
| కృష్ణా | 6 cr |
| నెల్లూరు | 4 cr |
| ఏపీ+తెలంగాణ టోటల్ | 80 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 10 cr |
| ఓవర్సీస్ | 11 cr |
| టోటల్ వరల్డ్ వైడ్ | 101 కోట్లు(షేర్) |
‘అఖండ 2′(Akhanda 2) చిత్రానికి రూ.101 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.102 కోట్ల షేర్ ను రాబట్టాలి. బాలయ్య కెరీర్లో హయ్యెస్ట్ థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమా ఇది. ఇప్పటివరకు బాలయ్య కెరీర్లో ఒక్క రూ.100 షేర్ మూవీ కూడా లేదు. ‘అఖండ 2’ కి బాలయ్య- బోయపాటి కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ తో ఇంత భారీ బిజినెస్ జరిగింది అని అర్ధం చేసుకోవచ్చు. మరి ఫుల్ రన్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అవుతుందో లేదో చూడాలి
