Akhanda ,Temper: బాబాయ్ ‘అఖండ’.. అబ్బాయ్ ‘టెంపర్’ స్పెషల్ షోలు ఎక్కడంటే.!

తెలుగు రాష్ట్రాల్లో మరి కొద్ది రోజుల్లో శివరాత్రి సందడి మొదలు కానుంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఫిబ్రవరి 11వ తేదీ నుంచి మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బెజవాడ దుర్గా మలేశ్వరుని ఆలయంలో, కోటప్ప కొండలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా మహాశివరాత్రి వేళ పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తాము కోరుకున్న కోరికలను నెరవేర్చుకునేందుకు రుద్రాభిషేకం, జలాభిషేకం వంటి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక శివరాత్రి అప్పుడు భక్తి శ్రద్ధలతో చేసే జాగారం సమయంలో సినిమా అనేది చక్కటి కాలక్షేపం..

అర్థరాత్రి వేళ 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు రెండేసి సినిమాలను ప్రదర్శించడం అనేది ఎప్పటినుండో జరుగుతూ వస్తోంది. అప్పట్లో ఒక టికెట్ మీద రెండు షోలు చూడడం అన్నది మర్చిపోలేని అనుభవం.. ఇక హైదరాబాద్‌లోనూ పలు ఏరియాల్లో ఈ అర్థరాత్రి ఆటలు వేస్తుంటారు. కట్ చేస్తే.. ఈసారి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో బాబాయ్ – అబ్బాయ్ సినిమాలు సందడి చెయ్యబోతున్నాయి. నటసింహ నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ ‘అఖండ’ తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సూపర్ హిట్ యాక్షన్,

ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘టెంపర్’ స్పెషల్ షోలు వేస్తున్నారు. ఫిబ్రవరి 13 నాటికి ‘టెంపర్’ 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఫ్యాన్స్ కోరిక మేరకు షోస్ వేస్తున్నారు.. బాలయ్య – బోయపాటిల క్రేజీ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ ఫిలిం ‘అఖండ’ పాండమిక్ తర్వాత జనాలను థియేటర్లకు రప్పించిన స్టార్ హీరో సినిమాగా.. డైలమాలో ఉన్న పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్నిచ్చిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఓటీటీలోనూ హంగామా కంటిన్యూ చేసింది.

ఫిబ్రవరి 19 అర్థరాత్రి 12:15 గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ 35MMలో షో పడనుంది..ఎన్టీఆర్ – పూరి జగన్నాథ్ కలిసి చేసిన సెకండ్ ఫిలిం.. ‘టెంపర్’.. వీరిద్దిరి కెరీర్లో ఇది ప్రత్యేకమైన సినిమా.. తారక్ అప్పటినుండి ఇప్పటి వరకు డబుల్ హ్యాట్రిక్ కొట్టడం విశేషం.. శివరాత్రి సందర్భంగా అర్థరాత్రి 12:15 గంటలకు దేవి 70MMలో స్పెషల్ షో వెయ్యనున్నారు..

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus