ప్రసుత కాలంలో హిట్ టాక్ వచ్చిన సినిమాలు థియేటర్లలో రెండు వారాలు ప్రదర్శితం కావడం కష్టమవుతోంది. పెద్ద సినిమాల నిర్మాతలు ఈ మధ్య కాలంలో 50 డేస్ ఫంక్షన్లను చేయడం మరిచిపోయారు. పెద్ద సినిమాలు థియేటర్లలో 50 రోజులు ప్రదర్శితం కావడం గగనమవుతోంది. అయితే బాలయ్య నటించిన అఖండ సినిమా మాత్రం 50 డేస్ సెంటర్ల విషయంలో నయా రికార్డులు క్రియేట్ చేస్తుండటం గమనార్హం. సంక్రాంతి పండుగకు రిలీజైన సినిమాలలో బంగార్రాజు సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.
అయితే బంగార్రాజు సినిమాకు టికెట్లు దొరకని ప్రేక్షకులు, అఖండ సినిమాను ఇప్పటివరకు చూడని ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపుతున్నారు, ఓటీటీలో అఖండ అందుబాటులో లేకపోవడంతో ప్రేక్షకులకు ప్రస్తుతం థియేటర్లలో మాత్రమే అఖండ సినిమాను చూసే ఛాన్స్ ఉంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా మంచి కలెక్షన్లను సొంతం చేసుకుందని సమాచారం. కేవలం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఈ సినిమా సంక్రాంతి రోజున రెండు లక్షల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుందని తెలుస్తోంది.
వీకెండ్ లో అఖండ చెప్పుకోదగ్గ స్థాయిలో షేర్ కలెక్షన్లను సాధించిందని సమాచారం. అఖండ ప్రస్తుతం 50కు పైగా థియేటర్లలో తెలుగు రాష్ట్రాలలో ప్రదర్శితమవుతోందని తెలుస్తోంది. ఈ థియేటర్లలో అఖండ 50 రోజుల వేడుకలను జరుపుకోవచ్చని తెలుస్తోంది. తొలిరోజు డివైడ్ టాక్ తెచ్చుకున్న అఖండ ఈ స్థాయిలో థియేటర్లలో 50 రోజుల పాటు ప్రదర్శితం కావడం సంచలనం అనే చెప్పాలి. బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా అఖండ మూవీ నిలిచింది.
అఖండ సక్సెస్ సాధించడంతో బాలయ్య అభిమానులు సంతోషిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్, బోయపాటి శ్రీనుకు సైతం ఈ సినిమా సక్సెస్ తర్వాత ఆఫర్లు పెరుగుతున్నాయి. ఏపీలోని అనంతపూర్ లో 10 కేంద్రాలలో అఖండ ప్రదర్శితమవుతోందని సమాచారం. కొత్త సినిమాలకు ధీటుగా అఖండ మూవీ మంచి కలెక్షనను సొంతం చేసుకుంటోంది.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!