బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన అఖండ మూవీ కలెక్షన్ల విషయంలో బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. నైజాం, సీడెడ్ ఏరియాలతో పాటు విదేశాలలో కూడా అఖండ సినిమాకు భారీస్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. ఈ వీకెండ్ నాటికి దాదాపుగా అన్ని ఏరియాలలో అఖండ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం అయితే ఉంది. అఖండ సక్సెస్ అటు బాలకృష్ణలో ఇటు బోయపాటి శ్రీనులో జోష్ నింపింది.
అఖండ 9 రోజుల కలెక్షన్లను గమనిస్తే:
నైజాం | 15.70 cr |
సీడెడ్ | 11.15 cr |
ఉత్తరాంధ్ర | 4.85 cr |
ఈస్ట్ | 3.25 cr |
వెస్ట్ | 2.67 cr |
గుంటూరు | 3.82 cr |
కృష్ణా | 2.83 cr |
నెల్లూరు | 2.06 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 46.63 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 8.95 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 55.58 cr |
అఖండ సినిమాకు 53.25 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరగగా శుక్రవారం రోజు ఈ సినిమా ఏకంగా కోటీ 40 లక్షల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించింది. 9 రోజులు పూర్తయ్యే నాటికి ఈ సినిమా షేర్ కలెక్షన్లు 55.58 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. అఖండ మూవీ గ్రాస్ కలెక్షన్లు 93.50 కోట్ల రూపాయలు కాగా ఏపీలో టికెట్ రేట్ల తగ్గింపు వల్ల ఏపీ డిస్ట్రిబ్యూటర్లకు పెద్దగా లాభాలు మిగిలే అవకాశాలు కనిపించడం లేదు. టికెట్ రేట్ల సమస్య లేకపోతే ఏపీలో కూడా ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయ్యి ఉండేది.
ఇప్పటికే సూపర్ హిట్ స్టేటస్ ను అందుకున్న అఖండ ఫుల్ రన్ లో 65 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించే ఛాన్స్ ఉంది. వచ్చే నెల నుంచి బాలయ్య తరువాత సినిమా పనులతో బిజీ కానున్నారు. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో సినిమా కూడా ఫిక్స్ అయిందని త్వరలో ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!