నందమూరి బాలకృష్ణ హీరోగా స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను హ్యాట్రిక్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ `అఖండ`. ‘ద్వారకా క్రియేషన్స్’ బ్యానర్ పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో ఓపెనింగ్స్ ఓ రేంజ్లో నమోదయ్యాయి. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి.
ఇక ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను ఓసారి గమనిస్తే :
నైజాం
12.10 cr
సీడెడ్
9.50 cr
ఉత్తరాంధ్ర
3.77 cr
ఈస్ట్
2.58 cr
వెస్ట్
2.05 cr
గుంటూరు
3.24 cr
కృష్ణా
2.26 cr
నెల్లూరు
1.70 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
36.75 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
7.80 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)
44.55 cr
‘అఖండ’ చిత్రానికి రూ.53.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.54 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.44.55 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.9.45 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. వీకెండ్ ను ఈ చిత్రం బాగా క్యాష్ చేసుకుంది.. అయితే వీక్ డేస్ లో నిలదొక్కుకున్న దానిబట్టే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఆధారపడి ఉంటుంది. మరి వీక్ డేస్ లో ఈ చిత్రం ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి..!