ఈ మధ్యకాలంలో బాలీవుడ్ నిర్మాతలు సౌత్ సినిమాలపై దృష్టి పెడుతున్నారు. దక్షిణాదిన ఏ భాషలో సినిమా హిట్ అయినా.. దాని మీద కర్చీఫ్ వేసేస్తున్నారు. ప్రధానంగా తెలుగు, తమిళ సినిమాలపై వాళ్ల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. గత కొన్నేళ్లలో పదుల సంఖ్యలో తెలుగు సినిమాలు రీమేక్ కావడం విశేషం. ఇప్పుడు టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ‘అఖండ’ సినిమాపై కూడా వారి దృష్టి పడిందని సమాచారం. సాజిద్ నడియాడ్ వాలా లాంటి కొందరు నిర్మాతల కన్ను ‘అఖండ’పై పడ్డట్లు మాటలు వినిపిస్తున్నాయి.
బాలీవుడ్ వాళ్లు ‘అఖండ’ విషయంలో బాగా కనెక్ట్ అయ్యే విషయం మరొకటి ఉంది. ఇందులో దేవాలయాల పరిరక్షణ గురించి, హిందుత్వం గురించి బలంగా చెప్పారు. ఇదే ఇప్పుడు నార్త్ ఇండియన్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో చాలా చోట్ల దీని గురించి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘అఖండ’ సినిమాలో అఖండ పాత్రను తీసుకొని, మిగతా కథలో కొంచెం మార్పులు, చేర్పులు చేస్తే మంచి కమర్షియల్ సక్సెస్ అందుకోవడానికి అవకాశముంటుందని..
అజయ్ దేవగన్ లాంటి హీరో అయితే దీనికి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని.. అక్షయ్ కుమార్ అయినా ఓకే అని భావిస్తున్నారట. మరి ఈ రీమేక్ లో ఎవరు నటిస్తారో చూడాలి!
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!