సోషల్ మీడియాలో జరిగే ట్రోల్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. అదే సమయంలో జనాలను ప్రభావితం చేస్తాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కొన్ని సందర్భాల్లో సీరియస్ విషయాన్ని చెప్పినా.. ఆ ట్రోల్స్ ను గుర్తు చేసి ఇరిటేట్ చేసే బ్యాచ్ ఎక్కువ మందే ఉంటారు. అలాంటి సందర్భాల్లో సెలబ్రిటీలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా అందరూ ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. అలాంటి టైంలో సెలబ్రిటీలు కనుక నెగిటివ్ కామెంట్లు చేస్తే అది ఇంకా పెద్ద రచ్చ అవుతుంది.
సరే ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. అక్కినేని అఖిల్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హలో’ మూవీ 2017 డిసెంబర్ లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన అఖిల్ అభిమాని ఒకరు.. ‘మైక్ ముందుకు వచ్చి అఖిల్ బాబే నెంబర్ 1 , అయ్యగారి నెంబర్ 1 ‘ అంటూ తన అభిమానాన్ని బయటపెట్టాడు.
అప్పటి నుండి ఆ అభిమాని అఖిల్ (Akhil) కంటే పాపులర్ అయిపోయాడు అనే కామెంట్స్, మీమ్స్ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. అఖిల్ ఎక్కడికి వెళ్లినా, ఏ ఫంక్షన్లో కనిపించినా ‘అయ్యగారు’ అంటూ అరిచే బ్యాచ్ కూడా ఉంది. తాజాగా దీని పై అఖిల్ స్పందించాడు. ‘ఎక్కడికి వెళ్లినా నన్ను ‘అయ్యగారు’ అని చాలా మంది అంటున్నారు. నా ఇంటి పేరు అక్కినేని అనే విషయాన్ని కూడా పక్కన పెట్టేశారు. నేను కూడా ‘అయ్యగారు’ అన్న వీడియోని చూసి పొంగిపొయాను.
అభిమానులు అందరూ నన్ను అయ్యగారు అంటే తప్పదు, నేను యాక్సెప్ట్ చేయాల్సిందే’ అంటూ అఖిల్ చెప్పుకొచ్చాడు. ఇక అఖిల్ నటించిన ‘ఏజెంట్’ సినిమా ఏప్రిల్ 28న విడుదల కాబోతోంది. ఆ సినిమా ప్రమోషన్ల టైంలో పాల్గొన్నప్పుడే ఈ విషయం పై అఖిల్ స్పందించడం జరిగింది. ‘ఏజెంట్’ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు.