అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా సాలిడ్ హిట్ ఇచ్చింది లేదు. ‘హలో’ (Hello) ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (Most Eligible Bachelor) వంటి సినిమాలతో పర్వాలేదు అనిపించినా.. అవి బ్లాక్ బస్టర్స్ అయితే కాలేదు. ఇక ‘అఖిల్’ (Akhil) ‘మిస్టర్ మజ్ను’ (Mr. Majnu) ‘ఏజెంట్’ (Agent) సినిమాలు పెద్ద డిజాస్టర్స్ అయ్యాయి. ఇదిలా ఉండగా.. ‘ఏజెంట్’ తర్వాత అఖిల్ నుండి మరో సినిమా రాలేదు. 2023 సమ్మర్లో ఆ సినిమా రిలీజ్ అయ్యింది. అంటే.. దాదాపు ఏడాదిన్నర అయినా అఖిల్ ఇంకో సినిమా అనౌన్స్ చేయలేదు.
Akhil Akkineni
నూతన దర్శకుడితో ‘యూవీ క్రియేషన్స్’ లో ఓ భారీ బడ్జెట్ సినిమా ఫిక్స్ అన్నారు. కానీ అది వర్కౌట్ కాలేదు. బడ్జెట్ సమస్యల కారణంగా అది హోల్డ్ లో పడింది. మరోపక్క సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని అఖిల్.. అందరినీ సర్ప్రైజ్ చేశాడు. దీంతో ఇప్పట్లో అఖిల్.. సినిమాలను పట్టించుకోడేమో అని అంతా అనుకున్నారు. కానీ అందరికీ షాకిస్తూ అఖిల్ సైలెంట్ గా సినిమా మొదలుపెట్టేశాడు.
కిరణ్ అబ్బవరంతో (Kiran Abbavaram) ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) అనే సినిమా తీసిన మురళీ కిషోర్ దర్శకత్వంలో అఖిల్ ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైపోయాయి అని సమాచారం. ‘లెనిన్’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారట. హీరోయిన్ గా శ్రీలీల ఫైనల్ అయిపోయింది. ప్రస్తుతం విలన్ కోసం గాలిస్తున్నారు.
‘1992 స్కామ్’ ఫేమ్ ప్రతీక్ గాంధీని సంప్రదించారట. కానీ అతని కాల్ షీట్స్ ఖాళీ లేని కారణంగా ఈ సినిమా ఆఫర్ ను వద్దనుకున్నట్టు సమాచారం. దీంతో తమిళ నటుడు విక్రాంత్ ని ఎంపిక చేసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్లో సాగే లవ్ స్టోరీగా ‘లెనిన్’ తెరకెక్కుతున్నట్టు సమాచారం.