వరుస ప్లాపులు.. అయినా మంచి ఛాన్స్ కొట్టిందిగా..!

శ్రీలీలని (Sreeleela)  కొన్నాళ్ల నుండి ప్లాపులు వెంటాడుతున్నాయి. రామ్ తో (Ram) చేసిన ‘స్కంద'(Skanda), వైష్ణవ్ తేజ్ తో (Panja Vaisshnav Tej) చేసిన ‘ఆదికేశవ'(Aadikeshava), నితిన్ తో (Nithin Kumar) చేసిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ (Extra Ordinary Man) ‘రాబిన్ హుడ్’  (Robinhood) వంటి సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు డిజాస్టర్లు అయ్యాయి. దీంతో ఆమెకు తెలుగులో ఛాన్సులు తగ్గాయి. ప్రస్తుతం ఆమె రవితేజకి (Ravi Teja) జోడీగా ‘మాస్ జాతర’ (Mass Jathara) సినిమాలో నటిస్తుంది. ఇది తప్ప ప్రస్తుతం తెలుగులో శ్రీలీలకి మరో ఛాన్స్ లేదు అని అంతా అనుకుంటున్న టైంలో.. ఆమెకు ఓ క్రేజీ ప్రాజెక్ట్ దక్కినట్టు అయ్యింది.

Akhil, Sreeleela

వివరాల్లోకి అఖిల్ (Akhil Akkineni) హీరోగా.. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyamu Vishnu Katha)  దర్శకుడు నందు అలియాస్ మురళీ కిషోర్ అబ్బూరు కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతుంది. ‘మనం ఎంటర్టైన్మెంట్’ తో కలిసి ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అఖిల్ కెరీర్లో 6 వ సినిమాగా రూపొందుతుంది ఈ ప్రాజెక్టు. చిత్తూరు బ్యాక్ డ్రాప్లో రూపొందే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అట. మాస్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయని సమాచారం.

ఇక ఇందులో హీరోయిన్ గా శ్రీలీల ఖరారైంది. కచ్చితంగా ఇది ఆమెకు మంచి ఆఫర్ అనే చెప్పాలి. ఇది కనుక హిట్ అయితే వరుసగా ఆమెకు యంగ్ హీరోల సరసన కూడా ఛాన్సులు వస్తాయి. ప్రస్తుతం శ్రీలీల హిందీలో కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) సరసన ఒక సినిమా చేస్తుంది. ప్రస్తుతం అది చిత్రీకరణ దశలో ఉంది. అలాగే మరో స్టార్ హీరో సినిమాలో కూడా శ్రీలీల నటించే అవకాశాలు ఉన్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus