Akhil, Srikanth: అలాంటి కథలో నటించబోతున్న అఖిల్.. బ్లాక్ బస్టర్ దక్కుతుందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో 6 నెలల వయస్సులోనే బాల నటుడిగా సిసింద్రీ సినిమాలో నటించి సక్సెస్ ను అందుకున్న అఖిల్ హీరోగా మాత్రం భారీ సక్సెస్ ను సొంతం చేసుకోవడంలో తడబడుతున్నారు. “అఖిల్”, “హలో”. “మిస్టర్ మజ్ను”, “ఏజెంట్” సినిమాలతో అఖిల్ కు భారీ షాకులు తగిలాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ హిట్టైనా ఆ సినిమా భారీ రేంజ్ హిట్ కాదని చాలామంది భావిస్తారు. ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు 30 కోట్ల రూపాయలు కూడా దాటలేదు.

స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తున్నా అఖిల్ కు కలిసిరావడం లేదు. అయితే అఖిల్ శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిందని తెలుస్తోంది. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న శ్రీకాంత్ అడ్డాల నారప్ప సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. నారప్ప మూవీ ఓటీటీలో విడుదలైనా మంచి లాభాలను అందించింది.

అఖిల్ శ్రీకాంత్ అడ్డాల కాంబో మూవీ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఏజెంట్ మూవీ కూడా యాక్షన్ జానర్ లో తెరకెక్కినా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఈ సినిమాతో అయినా అఖిల్ కు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ దక్కాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అటు అఖిల్, ఇటు శ్రీకాంత్ అడ్డాల పారితోషికాలు పరిమితంగానే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కొత్త ప్రాజెక్ట్ తో (Akhil) అఖిల్, శ్రీకాంత్ అడ్డాల బాక్సాఫీస్ ను షేక్ చేయాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అఖిల్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా శ్రీకాంత్ అడ్డాల అఖిల్ కు ఏ రేంజ్ హిట్ ఇస్తారో చూడాలి. అఖిల్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను అందుకోవడంతో పాటు ఇతర భాషల్లో సైతం సత్తా చాటాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

గాండీవదారి అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

బెదురులంక 2012 సినిమా రివ్యూ & రేటింగ్!
కింగ్ ఆఫ్ కొత్త సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus