అక్కినేని అఖిల్ పరిచయం అవసరం లేని పేరు నాగార్జున వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి అఖిల్ మొదటగా మనం సినిమాలో ఒక గెస్ట్ రోల్ లో కనిపించారు. ఈ సినిమా తర్వాత ఈయన వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన అఖిల్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు. అయితే మొదటి సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకాదరణ సంపాదించుకోలేదు. అనంతరం ఈయన నటించిన వరుస సినిమాలన్నీ కూడా డిజాస్టర్లుగా నిలిచాయి.
ఇలా వరుస ప్లాప్ సినిమాలతో సతమతమవుతున్నటువంటి అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనే విషయం తెలియడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాతో అఖిల్ ఫేట్ మారిపోతుందని అందరూ భావించారు. కానీ ఈ సినిమా విడుదలయి మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇలా ఈ సినిమా డిజాస్టర్ కావడంతో అఖిల్ సినీ కెరియర్ ఇబ్బందులలో పడిందని ఇకపై తనకు అవకాశాలు రావడం చాలా కష్టమే అంటూ అందరూ భావించారు.
ఇలా అఖిల్ (Akhil) సినిమాలు వరుసగా ఫెయిల్యూర్ కావడానికి మరేది కారణం కాదని ఆయన సినిమాల ఎంపిక విషయంలో తొందరపాటే కారణమని తెలుస్తుంది.వచ్చిన అవకాశాలన్నింటినీ అందుకొని సినిమాలలో నటించడంతోనే అఖిల్ ఇలా వరుస ఫ్లాప్ సినిమాలను చవిచూడాల్సి వస్తుంది. ఇలా వరుస ఫ్లాప్ సినిమాలు తనని వెంటాడటంతో అఖిల్ తన సినిమాల ఎంపిక విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
ఇకపై సినిమాలో ఎంపిక విషయంలో తన తాత అక్కినేని నాగేశ్వరరావు చెప్పిన పద్ధతిని ఫాలో కాబోతున్నారట. తాతయ్య ఎప్పుడు కూడా సినిమాల పరంగా ప్రేక్షకుల మనసు దోచేయాలని చెప్పేవారట.ఇలా ప్రేక్షకుల మనసు దోచుకోవాలి అంటే కథలో బలం ఉండాలనే విషయాన్ని గ్రహించానంటూ అఖిల్ ఓ సందర్భంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.