Akhil: బర్త్ సీక్రెట్స్ ను బయటపెట్టిన హీరో అఖిల్!

దసరా కానుకగా విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకు ప్రేక్షకుల నుంచి యావరేజ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే మహాసముద్రం, పెళ్లిసందడి సినిమాలతో పోలిస్తే బెటర్ టాక్ రావడం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అఖిల్ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. నాన్నగారు అమెరికాలో అమ్మకు పరీక్షలు చేయించిన సమయంలో అమ్మాయే అని చెప్పారని అమ్మాయి పుడుతుందని నాన్న ఆశపడ్డారని అఖిల్ అన్నారు. నాన్న అమ్మాయి పుట్టాలని కోరుకున్నారని డాక్టర్లు కూడా అమ్మాయి పుడుతుందని చెప్పడంతో పాప కొరకు గౌన్లు, ఫ్రాక్స్ కొన్నారని అఖిల్ చెప్పుకొచ్చారు.

నేను పుట్టకముందే ఇండియాకు రావడానికి ఫ్లైట్ టికెట్లు బుక్ చేయడంతో పాటు అందులో నికిత అనే పేరు రాశారని అఖిల్ పేర్కొన్నారు. అయితే డెలివరీ తర్వాత అబ్బాయి పుట్టాడని తెలిసి నాన్న షాక్ అయ్యారని అఖిల్ వెల్లడించారు. అఖిల్ చెప్పిన బర్త్ సీక్రెట్స్ ను విని ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతవుతోంది. ఇప్పటికీ ఈ ఘటనను తలుచుకుంటే నాగ్, అతని కుటుంబ సభ్యులు నవ్వుకుంటారని సమాచారం. మరోవైపు అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ సినిమాపై దృష్టి పెట్టారు.

ఏడాదిన్నర నుంచి ఏజెంట్ సినిమా కొరకు బాడీ బిల్డప్ చేశానని అఖిల్ అన్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తొలిరోజే ఆరు కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించడం గమనార్హం. ఏజెంట్ సినిమాతో అఖిల్ ఇండస్ట్రీ హిట్ సాధిస్తాడని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus