Akhil: సీజన్ 4 రోబో గేమ్ ని గుర్తుచేసిన ఏలియన్ టాస్క్..! టాస్క్ లో జరిగింది ఇదే..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో ఏలియన్ టాస్క్ సీజన్ 4 రోబో టాస్క్ ని గుర్తు చేసింది. ఈవారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో భాగంగా ఏలియన్స్ వర్సెస్ హ్యూమన్స్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఏలియ. న్స్ గ్రూప్ లో నటరాజ్ మాస్టర్, బిందుమాధవి, అరియనా, అజయ్, హమీదా ఉన్నారు. హ్యూమన్స్ గ్రూప్ లో అఖిల్, అషూరెడ్డి, శివ, అనిల్, మిత్రాశర్మాలు ఉన్నారు. ఈ గేమ్ కి వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన బాబాభాస్కర్ సంచాలక్. ఇక్కడే హ్యూమన్స్ ఏలియన్స్ దగ్గర ఉన్న లైఫ్ బాల్స్ ని దక్కించుకుని వాటిని పగలకొట్టాల్సి ఉంటుంది.

Click Here To Watch NOW

అలా పగలగొట్టినపుడు ఒక ఏలియన్ ని చంపే హక్కు హ్యూమన్స్ కి వస్తుంది. అలాగే, ఏలియన్స్ హ్యూమన్స్ చేతులకి రంగు పూయాలి. అలా పూస్తే వాళ్లకి రెండు పాయింట్స్ బ్యాటరీ లభిస్తుంది. ఈ టాస్క్ వినగానే అందరికీ రోబో టాస్క్ గుర్తుకు వచ్చింది. అప్పటి సీజన్ లో అఖిల్ – అరియానా ఇద్దరికీ ఈ టాస్క్ ఆడిన అనుభవం ఉంది. నిజానికి ఇధి ఫిజికల్ టాస్క్. లైఫ్ బాల్స్ ని కాపాడుకోవడం అంత ఈజీ కాదు. ముగ్గురు ఏలియన్స్ చనిపోతే అల్ మోస్ట్ గేమ్ అయిపోయినట్లే.

అయితే, ఇక్కడే ఎవరికైనా రెండు చేతలకి రంగు పూసినపుడు ఛార్జింగ్ వస్తే, ఆ ఛార్జింగ్ పాయింట్స్ ని ఉపయోగించి ఏలియన్ ని తిరిగి బ్రతికించుకోవచ్చు. ఇక ఈ టాస్క్ ప్రారంభం అవ్వగానే అఖిల్ సార్థక్ రెచ్చిపోయి మరీ గేమ్ ఆడాడు. ఎటాకింగ్ లోకి వచ్చి తన గేమ్ ని మరోసారి చూపించాడు. హ్యామన్స్ గ్రూప్ కి మొదటిలోనే ఒక పాయింట్ తీస్కుని వచ్చాడు. బిందు మాధవి దగ్గర ఉన్న లైఫ్ బాల్ ని అఖిల్ దక్కించుకుని పగలగొట్టాడు. ఫస్ట్ రౌండ్ లో అజయ్ ని ఏలియన్ నుంచీ తప్పించాడు.

దీంతో అజయ్ మద్యలో వచ్చి మాట్లాడుతుంటే సీరియస్ అయ్యాడు అఖిల్. గేమ్ లో అవుట్ అయితే మాట్లాడద్దని సంచాలక్ అయిన బాబాభాస్కర్ కి చెప్పాడు. అంతేకాదు, హ్యూమన్స్ ఎలా ఉండాలి. హ్యాండ్స్ ని ఎలా ప్రొటక్ట్ చేస్కోవాలో అందరికీ చెప్తూనే అందరినీ కాపాడుకున్నాడు. ఇక రెండోసారి కూడా ఎటాకింగ్ చేసి లైఫ్ బాల్ ని తీస్కుని వచ్చి పగలగొట్టాడు అఖిల్. అయితే, మద్యలో అషూరెడ్డి హమీదాకి చిక్కడంతో చేతులకి పెయింట్ పూసేసింది. దీంతో హ్యూమన్స్ లో గేమ్ ఆడే అర్హతని అషూ కోల్పోయింది.

తిరిగి రెండు పాయింట్స్ ఛార్జింగ్ దక్కించుకున్న ఏలియన్స్ అజయ్ ని గేమ్ లోకి తీస్కుని వచ్చారు. దీంతో టాస్క్ రసవత్తరంగా మారింది. అఖిల్ కి అరియానాకి మద్యలో గట్టి యుద్ధమే జరిగింది. ఒకరినొకరు అరుచుకుంటూ టాస్క్ ని నిలిపేశారు. అరియానా బెడ్ రూమ్ లో మూల దాక్కుని లైఫ్ బాల్ ని కాపాడుకునే ప్రయత్నం చేసింది. అక్కడ గేమ్ ఆఢటం సరిగ్గా కుదరడం లేదని సంచాలక్ అయిన బాబాభాస్కర్ కి చెప్పాడు అఖిల్. కానీ, అరియానా వినిపించుకోలేదు.

దీంతో ఇద్దరి మద్యలో ఆర్గ్యూమెంట్ జరిగింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఎనౌన్స్ చేసే సరికి అందరూ లివింగ్ రూమ్ లోకి వచ్చి గేమ్ ని ప్రారంభించారు. ఇక అఖిల్ మూడో లైఫ్ బాల్ కోసం ప్రయత్నిస్తుండగా, ఈరోజుకి టాస్క్ సమయం పూర్తి అయ్యిందని ఎనౌన్స్ మెంట్ వచ్చింది. దీంతో ఎవరికి వారు రిలాక్స్ అయ్యారు. చిన్న చిన్న దెబ్బలు తగిలిన శివ, అజయ్ ఇద్దరూ మెడికల్ ట్రీట్మెంట్ తీస్కున్నారు. మొత్తానికి అదీ మేటర్.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus