Akhil: అఖిల్ మదర్ కావాలనే అలా చెప్పిందా..? అసలు జరిగింది ఇదే..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లోకి ఫ్యామీలీ మెంబర్స్ , ఫ్రెండ్స్ వస్తున్నారు. పార్టిసిపెంట్స్ వాళ్లని చూస్తూ ఆనందంతో ఉబ్బితబ్బిబైపోతున్నారు. ఫస్ట్ అరియానా ఫ్రెండ్ రవితేజ వచ్చి హౌస్ లో సందడి చేశాడు. చాలా హుషారుగా మాట్లాడుతూ హౌస్ మేట్స్ కి కిక్ ఇచ్చాడు. సరదాగా జోకులు వేశాడు. ఆ తర్వాత వచ్చిన అఖిల్ మదర్ అఖిల్ కి బుద్దులు చెప్పింది. ఇక్కడికి నువ్వు గేమ్ ఆడటానికి మాత్రమే వచ్చావని , ఎవరితో రిలేషన్ అవసరం లేదని చెప్పింది.

అంతేకాదు, ఎ గురించి , బి గురించి, సి గురించి ఆలోచించకు ఓన్లీ డి అంటే డాడీ గురించి మాత్రమే ఆలోచించు అంటూ చెప్పింది. అలాగే, వాళ్ల నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉందో కూడా క్లియర్ గా చెప్పింది. అన్నీ మర్చిపోతున్నారని, నీ వీడియోలు చూపిస్తూ అఖిల్ చెప్పాడని చెప్పి మందులు వేస్తున్నామని చెప్పింది. అఖిల్ వాళ్ల మదర్ అఖిల్ డాడీ గురించి మాట్లాడుతుంటే హౌస్ మేట్స్ అందరూ భావోద్వేగానికి గురి అయ్యారు.

ఫస్ట్ నుంచీ కూడా అఖిల్ నేను మా నాన్న కోసమే రెండోసారి గేమ్ కి వచ్చానని చెప్పాడు. ఇక అఖిల్ మదర్ బిందు మాధవిని హగ్ చేసుకుని ఇదంతా గేమ్ లో మాత్రమే అని, బయటకి వచ్చాక మా ఇంటికి రావాలని చెప్పింది. అలాగే, యాంకర్ శివతో కూడా నీ కల నెరవేరిందని, అన్ని సీజన్స్ చూసి ఇక్కడికి వస్తే ఏం ఆడాలో కూడా తెలియదని చురకలు వేసింది. అఖిల్ కి కప్పు ముఖ్యం అని, కప్పుకోసమే నువ్వు ఇక్కడికి వచ్చావని గుర్తు చేసింది.

ఎమోషన్స్ పెట్టుకోవద్దని, ఎవరికైనా సరే ఇచ్చిపారేయమని క్లియర్ గా చెప్పింది. ఇక కావాలనే అఖిల్ మదర్ కొన్ని పాయింట్స్ చెప్పిందా అనిపించింది. అలాగే, వెళ్లిపోయేటపుడు అందరూ మీ గురించి మాత్రమే గేమ్ ఆడండి అంటూ హింట్ ఇచ్చి వెళ్లింది. బిందుమాధవి మరోసారి అఖిల్ మదర్ ని హగ్ చేసుకుని ఇదంతా గేమ్ గురించి మాత్రమే అని, అఖిల్ ని ఏమని అన్నా బాధపడకండి అంటూ చెప్పింది. అఖిల్ మదర్ గేమ్ అయిపోయిన తర్వాత మా ఇంటికి రమ్మని చెప్పింది.

అఖిల్ మదర్ రావడంతోనే స్వీట్స్ తీసుకుని వచ్చి అందరికీ తినిపించింది. అలాగే అందరికీ బుద్దులు చెప్పింది. అషూని అఖిల్ వెనకబడుతోందని టీజ్ చేసింది. అలాగే అరియానా గేమ్ సీజన్ 4 నుంచీ చూస్తుందే అంటూ చెప్పింది. ఇక ఇంటి నుంచీ వెళ్లిపోయేటపుడు హౌస్ మేట్స్ తో కలిసి డ్యాన్స్ వేసి మరీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పింది.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus