అఖిల్ పక్కన నితిన్ హీరోయిన్

అక్కినేని ప్రిన్స్ అఖిల్ అఖిల్ సినిమాతో మంచి నటుడిగా నిరూపించుకున్నా విజయాన్ని అందుకోలేకపోయారు. తర్వాత హలో సినిమాలో బెస్ట్ ఫెర్మార్మెన్స్ ఇచ్చి సినిమాని నిలబెట్టారు. కానీ కలక్షన్ పరంగా ఈ మూవీ సంతృప్తిని ఇవ్వలేకపోయింది. ఈ సారి కమర్షియల్ హిట్ కొట్టాలని తమ కుటుంబానికి కలిసి వచ్చే ప్రేమ కథని ఎంచుకున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించడానికి అఖిల్ ఓకే చెప్పారు. ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఎస్.ఎస్. థమన్ స్వరాలూ కూర్చే పనిలో బిజీగా ఉండగా… అఖిల్, డైరక్టర్ తో కలిసి థాయ్ ల్యాండ్ కి వెళ్లారు. అక్కడ మంచి లొకేషన్స్ వెతికే పనిలో పడ్డారు.

తాజాగా ఈ మూవీలో హీరోయిన్ ని ఖరారు చేసినట్లు తెలిసింది. నితిన్ ‘లై’ సినిమాతో తెలుగువారికి పరిచయమైన మేఘా ఆకాష్ ను అఖిల్ కి జోడీగా ఒకే చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈమె నితిన్ తో కలిసి “ఛల్ మోహన్ రంగ”లో నటించింది. ఈ చిత్రం రిలీజ్ కాకముందే ఈ ఛాన్స్ అందుకుంది. ఈ విషయాన్నీ చిత్ర బృందం త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. బీవీఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ
మే నుంచి సెట్స్ మీదకు వెళుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus