Akhil New Look: అఖిల్ ఏజెంట్ హై వోల్టేజ్ లుక్!

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయం కోసం ఎదురుచూస్తున్నా హీరో లలో అఖిల్ అక్కినేని టాప్ లిస్టులో ఉన్నాడు. గత కొంత కాలంగా ఈ హీరో ఎంత ట్రై చేస్తున్నా కూడా సరైన సక్సెస్ రావడం లేదు. ముందుగా మాస్ జనాలను ఎక్కువగా ఎట్రాక్ట్ చేయాలని చూస్తున్నాడు. ఇటీవల వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా హిట్ అయ్యింది కానీ ఇంకా పూర్తి స్థాయిలో అతనికి సంతృప్తిని ఇవ్వలేకపోయింది. ఇక ఎలాగైనా తన 5వ సినిమా ఏజెంట్ సినిమాతో అతను ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.

మాస్ యాక్షన్ డైరెక్టర్ సురేంధర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. సినిమాను ఈ డిసెంబర్ లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా షూటింగ్ పనులకు అంతరాయం కలగడంతో వాయిదా వేయక తప్పలేదు. ఈ సినిమా కోసం అఖిల్ తన శక్తిని మొత్తం ధారపోస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా కండలు తిరిగిన బాడీలో కనిపిస్తున్నాడు.

ఇన్నాళ్లు ఇలాంటి లుక్ కోసమే అభిమానులు ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు. సురేందర్ రెడ్డి అఖిల్ ను కరెక్ట్ గా వాడుతున్నట్లు అర్ధమవుతోంది. ఇక సినిమాలో అఖిల్ అయితే ఒక ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. స్పై థ్రిల్లర్ గా సినిమాను సరికొత్త తరహాలో తెరపైకి తీసుకు రానున్నారట. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని చిత్ర యూనిట్ చాలా నమ్మకంతో ఉంది. మరి అఖిల్ అభిమానుల అంచనాలను ఎంతవరకు అందుకుంటాడో చూడాలి.

ఇక ఈ సినిమాలో మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి కూడా ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు. ఇక ముంబై మోడల్ సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్న ఏజెంట్ సినిమాను AK ఎంటర్టైన్మెంట్స్ తో పాటు సురేందర్ రెడ్డి కూడా తన హోమ్ బ్యానర్ లోనే సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లోనే సినిమాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus