Akhil: అఖిల్‌ కొత్త సినిమా పేరు ఇదేనా? బడ్జెట్‌ లెక్క ఇదేనా?

‘ఏజెంట్‌’గా ఇటీవల థియేటర్లలో సందడి చేసిన అఖిల్‌ ఇప్పుడు కొత్త సినిమా ప్రారంభించే పనిలో ఉన్నాడు. చాలా రోజుల క్రితమే ఓకే అయిన సినిమాను త్వరలోనే ప్రారంభిస్తారు అని తెలుస్తోంది. అయితే అఖిల్‌ సినిమా బడ్జెట్ విషయంలో లెక్కలేస్తున్నారు అంటూ వచ్చిన పుకార్లను కొట్టిపారేసేలా ఓ వార్త బయటకు వచ్చింది. దాని ప్రకారం చూస్తే.. అఖిల్‌ కెరీర్‌లో ఇది భారీ బడ్జెట్‌ సినిమా అవుతుంది అని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాకు పేరు కూడా ఫిక్స్‌ చేసేశారు అని చెబుతున్నారు.

ఫాంటసీ అడ్వెంచర్ కథాంశంతో అఖిల్‌ కొత్త సినిమా ఉండబోతోందట. ‘సాహో’ సినిమా డైరక్షన్‌ టీమ్‌లో పని చేసిన అనిల్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇటీవల అఖిల్‌కు అనిల్‌ ఇటీవల ఓ కథ వినిపించారట. కథ బాగా నచ్చడంతో అఖిల్‌ వెంటనే ఓకే చెప్పేశాడని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయట. ఈ క్రమంలో సినిమాకు ‘ధీర’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు అని చెబుతున్నారు.

అన్నట్లు ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవల కాలంలో వరుసగా ఎదురు దెబ్బలు తిన్న యూవీ టీమ్‌.. ఈ సినిమా విషయంలో పక్కాగా ఉంటోందట. అందుకే కథ, కథనం, టీమ్‌.. ఇలా అన్నీ పక్కాగా ప్లాన్‌ చేసుకుని బరిలోకి దిగాలని నిర్ణయించారట. ప్రస్తుతం ఈ బ్యానర్‌లో తెరకెక్కుతున్న సినిమా ఇదొక్కటే కావడం గమనార్హం. అనుష్క సినిమా అయితే షూటింగ్‌ పూర్తి చేసేసుకుంది.

ఇక అఖిల్‌ (Akhil) కొత్త సినిమాలో హీరోయిన్ ఇప్పటికే ఓకే అయ్యిందని చెబుతున్నారు. ప్రస్తుతం ‘దేవర’తో జట్టు కట్టిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ చిత్రంలో అఖిల్ సరసన నటించబోతుందట. త్వరలోనే ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ ఓపెనింగ్‌ ఉంటాయి అని చెబుతున్నారు. ఆ రోజు అఖిల్‌ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్‌లు కూడా ఉంటాయి అంటున్నారు. అవేంటో చూడాలి మరి.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus