ఎమోషనల్ అయిన అఖిల్ సార్థక్.. ఎందుకంటే..?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షోకు భారీగా ప్రేక్షకాదరణ ఉన్న సంగతి తెలిసిందే. గత సీజన్లకు భిన్నంగా బిగ్ బాస్ షో సీజన్ 4లో ఆరు పదుల వయస్సు ఉన్న గంగవ్వ పాల్గొనగా గంగవ్వ ఎంట్రీతో ప్రేక్షకులకు కూడా సీజన్ 4పై ఆసక్తి క్రియేట్ అయింది. అనారోగ్య కారణాల వల్ల గంగవ్వ బిగ్ బాస్ హౌస్ నుంచి మధ్యలోనే బయటకు రాగా బిగ్ బాస్ హౌస్ లో ఉండి ఉంటే మాత్రం ఆమె టాప్ 5 కంటెస్టెంట్ల జాబితాలో ఉండేవారని గంగవ్వ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

బిగ్ బాస్ షో ద్వారా సొంతింటి కలను నెరవేర్చుకున్న గంగవ్వ హౌస్ లో ఇతర కంటెస్టెంట్లతో పోలిస్తే అఖిల్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. గంగవ్వ అఖిల్ ను సొంత మనవడిలా చూసుకోవడంతో పాటు పంచ్ లు కూడా వేసేవారు. తాజాగా అఖిల్ ఇంటికి వచ్చి గంగవ్వ రచ్చరచ్చ చేయడంతో పాటు అఖిల్ ను చూసి తెగ మురిసిపోయారు. అఖిల్ ఫ్యామిలీతో అఖిల్ ను తీసుకుపోయేందుకు వచ్చానంటూ గంగవ్వ సరదాగా కామెంట్లు చేశారు.

అఖిల్ వేసుకున్న చినిగిపోయిన జీన్స్ ను చూసి ఇలా చినిగిపోయిన జీన్స్ ను మా ఇంట్లో మసిగుడ్డలా వాడతానని అఖిల్ పై పంచ్ లు వేశారు. ఆ తరువాత అఖిల్ ఒక్కడే కాదని ఇతరులు కూడా ఇవే తరహాలో దుస్తులు వాడుతున్నారని ఆమె తెలిపారు. ఆ తరువాత అఖిల్ అమ్మానాన్నలు కనిపించకపోవడంతో ఆమె అఖిల్ అమ్మానాన్నల గురించి అడిగారు. అఖిల్ వాళ్ల అమ్మానాన్నలను అవ్వకు పట్టీల కోసం పంపించగా వాళ్లు డిజైన్ పట్టీలను తీసుకొచ్చారు.

డిజైన్ పట్టీలను అవ్వ కాలికి పెట్టి అఖిల్ గంగవ్వను సర్ ప్రైజ్ చేశాడు. ఆ తరువాత నా అవ్వ బంగారం అంటూ గంగవ్వ గురించి చెబుతూ అఖిల్ ఎమోషనల్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా అఖిల్, గంగవ్వ అవ్వామనవడు బంధాన్ని కొనసాగిస్తూ ఉండటం గమనార్హం.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus