అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన అఖిల్, హలో, మిస్టర్ మజ్ను సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో గీతాఆర్ట్స్2 బ్యానర్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తెరకెక్కి తాజాగా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో అఖిల్ ఫ్యాన్స్ ఏజెంట్ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు.
అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ అల్లు అరవింద్ గారు ఫోన్ చేసిన సమయంలో లవ్ స్టోరీ అని చెప్పగానే నిరాశ చెందానని అయితే కథ కొత్తగా అనిపించి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని చెప్పుకొచ్చారు. బొమ్మరిల్లు భాస్కర్ కు హిట్లు లేవని తాను అనుకోలేదని నేనేం బ్లాక్ బస్టర్ ఇచ్చి రాలేదు కదా అంటూ అఖిల్ కామెంట్లు చేశారు. కథను నమ్మే ఈ సినిమా తీశామని అఖిల్ చెప్పుకొచ్చారు.
నాన్నకు కథ చెప్పానని నాన్న ఇచ్చిన చిన్నచిన్న సలహాలను తీసుకున్నానని అఖిల్ పేర్కొన్నారు. సినిమాలో రొమాంటిక్ సీన్లలో నటించే సమయంలో కొంత ఇబ్బంది పడ్డానని అఖిల్ చెప్పుకొచ్చారు. సినిమాలో స్పైసీ డైలాగ్స్ ఉంటాయని ఆ డైలాగ్స్ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టవని అఖిల్ పేర్కొన్నారు. అల్లు అరవింద్ ను తాను గాడ్ ఫాదర్ లా భావిస్తానని అల్లు అరవింద్, బన్నీవాస్ అనుభవం ఈ సినిమాకు ఎంతగానో ఉపయోగపడిందని అఖిల్ వెల్లడించారు.