Akhil: సూరి… అఖిల్‌ను కొత్తగా చూపిస్తాడట!

హీరో పుట్టిన రోజు అంటే… ప్రస్తుతం షూటింగ్‌ అవుతున్న సినిమా, త్వరలో మొదలవ్వబోయే సినిమా ఇలా అతనికి సంబంధించి సినిమాల ఫస్ట్‌ లుక్‌లు, టీజర్లు, పోస్టర్లు వస్తుంటాయి. అలా అఖిల్‌కి రేపు (ఏప్రిల్‌ 8) పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సురేందర్‌ రెడ్డితో త్వరలో మొదలవ్వబోయే సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్‌డేట్‌ ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ సారి ఆ పోస్టర్‌ అభిమానులకు ఓ స్వీట్‌ షాక్‌ అని సమాచారం.

అఖిల్‌ చూడటానికి చాక్లెట్‌ బాయ్‌లా ఉంటాడు. తొలి సినిమా ‘అఖిల్’ మినహాయించి మిగిలిన సినిమాల్లో లవర్ బాయ్‌గానే కనిపించాడు. అయితే యాక్షన్‌ హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్‌ చేసుకోవాలని అఖిల్‌ ఎప్పటి నుండో అనుకుంటున్నాడు. సూరి సినిమాలో ఇది నెరవేరబోతోందని టాక్. ఈ సినిమా ఫుల్‌ మాస్‌ మసాలా యాక్షన్‌ ఎంటర్టైనర్‌ అని సమాచారం. దీని కోసం అఖిల్‌ సిక్స్‌ ప్యాక్‌ బాడీ సిద్ధం చేశాడని అంటున్నారు. అంతేకాదు పుట్టిన రోజు సందర్భంగా ఆ లుక్‌ను రివీల్‌ చేస్తారని సమాచారం.

‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ సినిమా కోసం అఖిల్‌ లవర్‌ బాయ్‌గానే కనిపిస్తున్నాడు. అయితే సూరి సినిమా కోసం లుక్‌ పూర్తిగా మార్చాలని అనుకున్నాడట. అందుకే ఈ సిక్స్‌ ప్యాక్‌. మరి లవర్‌ బాయ్‌ సిక్స్‌ ప్యాక్‌ చేస్తే ఎలా ఉంటుందో చూడాలి. మరోవైపు ఇలా ఏం చేసినా ఫర్వాలేదు కానీ అఖిల్‌ సరైన హిట్‌ వస్తే బాగుండు అని అభిమానులు కోరుకుంటున్నారు. విన్నావా అఖిల్‌… పుట్టిన రోజు నాడు ఆ భరోసా ఇవ్వాలి మరి.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus