ప్రేమ కథతో రాబోతోన్న అఖిల్

తెలుగు చిత్రపరిశ్రమలో రొమాంటిక్ హీరోగా పేరు దక్కించుకున్న తొలి హీరో అక్కినేని నాగేశ్వరరావు. అనేక విభిన్నమైన ప్రేమ కథలతో సినిమాలు చేసి విజయాలను అందుకున్నారు. ఆ తర్వాత అతని తనయుడు అక్కినేని నాగార్జున రొమాంటిక్ హీరోగా పిలుపు అందుకున్నారు. ఏఎన్నార్ మనవుడు, నాగ్ పెద్ద కుమారుడైన నాగచైతన్య ఏ మాయ చేసావే సినిమాతో ప్రేమ కథలకు అక్కినేని ఫ్యామిలీ పెట్టింది పేరని నిరూపించుకున్నారు. ఇక నాగ్ చిన్న తనయుడు అఖిల్ యాక్షన్ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చారు. అఖిల్ మూవీ నిరాశ పరిచింది. ఇక విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేసిన హలో మూవీతో విజయాన్ని దక్కించుకున్నారు.

అందులో ప్రేమ ఉన్నప్పటికీ యాక్షన్ పై ఎక్కువ దృష్టి పెట్టారు. ఈ సారి మాత్రం అఖిల్ పూర్తి స్థాయి ప్రేమకథతో రాబోతున్నారు. తొలి ప్రేమ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించబోతున్నారు. ఈ దర్శకుడు ఇప్పటికే అఖిల్ కి కథ వినిపించడం అతను గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో వెంకీ అట్లూరి బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో అఖిల్ రొమాంటిక్ హీరో అనిపించుకుంటారని అభిమానులు ధీమాగా చెబుతున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమా గురించి త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus