Akhil, Bindu Madhavi: మరోసారి సీజన్ 4 ని గుర్తు చేస్తున్నారు. ఇందులో పులి ఎవరంటే..,

బిగ్ బాస్ సీజన్ 4 అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో అభిజీత్ ఇంకా అఖిల్ ఇద్దరూ ఒకరినొకరు నువ్వా నేనా అన్నట్లుగా గేమ్ ఆడారు. అఖిల్ అప్పట్లో సీక్రెట్ రూమ్ నుంచీ వచ్చిన తర్వాత జరిగిన నామినేషన్స్ లో మాట్లాడిన మాటలు, అభీజిత్ వేసిన కౌంటర్స్ ఇప్పటికీ బిగ్ బాస్ లవర్స్ ఎవ్వరూ మర్చిపోలేనివి. పులి మేక నామినేషన్స్ సీజన్ కే హైలెట్ గా నిలిచాయి. ఆ తర్వాత సీజన్ 5 అయిపోయినా కూడా ఇప్పటికీ ఇది సోషల్ మీడియాలో రచ్చ లేపుతునే ఉంటుంది.

Click Here To Watch Now

అయితే, ఈసారి బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో యాంకర్ శివ చిలకజోస్యం చెప్తూ ఈ విషయాన్ని పైకి లేపాడు. అఖిల్ జాతకం చూస్తూ నిన్ను ఢీకొట్టేందుకు ఈసారి ఆడపులి వస్తోందని జోస్యం చెప్పాడు. నిజంగా యాంకర్ శివ చెప్పినట్లే ఇప్పుడు సీజన్ 4ని మరోసారి గుర్తు చేసేలా బిందుమాధవి ఫస్ట్ నుంచీ అఖిల్ తోనే వైరం పెట్టుకుంటోంది. అఖిల్ కూడా ఎక్కడా తగ్గకుండా నువ్వా నేనా అన్నట్లుగా మాటల విసురుతున్నాడు.

ఫస్ట్ వీక్ లో బిందుమాధవి అఖిల్ ని నామినేట్ చేసింది. అప్పట్నుంచీ అఖిల్ బిందుతో వార్ పెట్టుకుంటునే ఉన్నాడు. బిందుమాధవి అన్నం పెట్టుకునేటపుడు వచ్చిన డైలాగ్ కి బిందు ప్లేట్ విసిరేసి వెళ్లిపోయింది. వీకెండ్ నాగార్జున ఈ ఇష్యూలో బిందుకి క్లాస్ పీకాడు. దీంతో అఖిల్ రెచ్చిపోయాడు. అఖిల్ తప్పులేదని డిసైడ్ అయ్యాడు. ఇదే పాయింట్ ని బిందు నామినేషన్స్ లో లేవనెత్తింది. నా తప్పు ఎంతుందో పెట్టుకునేటపుడు డైలాగ్ వేసిన నీ తప్పు కూడా అంతే ఉందని వాదించింది.

నిజానికి అఖిల్ సరదాగా అనిల్ తో అన్న మాటలవి. అయినా కూడా బిందు రెచ్చిపోయి అఖిల్ తో ఫైట్ కి దిగింది. నామినేషన్స్ లో హైలెట్ చేసింది. ఇక ప్రస్తుతం నామినేషన్స్ అయిన తర్వాత ఓటింగ్ లో బిందుమాధవి అఖిల్ తో పోటీ పడుతోంది. ఫస్ట్ డే నుంచే తన ఓటింగ్ పవర్ ని చూపిస్తోంది. తమిళ బిగ్ బాస్ లో ఉన్న ఫాలోవర్స్, తెలుగులో ఉన్న క్రేజ్ ఇప్పుడు ఆమెకి హ్యూజ్ ఓటింగ్ వచ్చేలా చేస్తోంది. ఇలాగే రెండు మూడు వారాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా పులి మేక వార్ కొనసాగేలాగానే కనిపిస్తోంది. అదీ మేటర్.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus