నితిన్,అఖిల్.. అప్పుడే పోటీకి రెడీ అయిపోయారు..!

కొద్దిసేపటి క్రితం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ నుండీ హీరో అఖిల్ మరియు హీరోయిన్ పూజా హెగ్డే ఉన్న ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో అఖిల్ ల్యాప్ టాప్ లో ఏదో చూసుకుంటూ ఉంటే.. హీరోయిన్ పూజా హెగ్డే తన కాళ్ళతో అఖిల్ ను డిస్టర్బ్ చేస్తుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ‘జి.ఏ2 పిక్చర్స్’ బ్యానర్ పై బన్నీవాస్ నిర్మిస్తున్నాడు.ఇక ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాన్ని 2021 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు కూడా ఈ పోస్టర్ లో ఉంది.

ఇప్పుడు ఎలాగూ థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ ఓపెన్ అయినా 3 నెలల వరకూ ప్రేక్షకులు థియేటర్లకు వస్తారన్న గ్యారెంటీ లేదు. అందుకే అఖిల్ చిత్రాన్ని 2021 సంక్రాంతికి విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నట్టు స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా.. నితిన్ హీరోగా వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘రంగ్ దే’ చిత్రాన్ని కూడా సంక్రాంతికే విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈమధ్యనే నితిన్ పెళ్లి రోజున ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వారు ‘రంగ్ దే’ టీజర్ ను విడుదల చేశారు.

అందులో ‘రంగ్ దే’ ను కూడా సంక్రాంతికే విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో 2021 సంక్రాంతికి అఖిల్, నితిన్ ల మధ్య పోటీ ఫిక్స్ అని తేలిపోయింది. ఇక్క ఒక విచిత్రం ఏమిటంటే.. అఖిల్ ను హీరోగా లాంచ్ చేసిన ప్రొడ్యూసర్ నితినే అన్న సంగతి తెలిసిందే. ఇక నితిన్.. తాను లాంచ్ చేసిన హీరోతోనే పోటీ పడబోతున్నాడన్న మాట..!

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus