Akhil: అయ్యప్ప దీక్షలో అఖిల్.. హాట్ టాపిక్ గా నిలిచిన లేటెస్ట్ వీడియో!

‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘యానిమల్’. టీజర్, ట్రైలర్స్ తో ఈ మూవీ బోలెడంత హైప్ ను సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి సాధ్యం కాని బజ్ ను ‘యానిమల్’ సంపాదించుకుంది అని చెప్పాలి. దీంతో డిసెంబర్ 1న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం అటు బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.

ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఈ సినిమా ఎక్కువగా చర్చల్లో నిలిచింది. సెలబ్రిటీలు కూడా ఎగబడి ఈ సినిమాని వీక్షిస్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా అక్కినేని అఖిల్ కూడా ఈ చిత్రాన్ని వీక్షించడం జరిగింది. ఇందులో విచిత్రం ఏముంది అని మీరు అనుకోవచ్చు. కానీ అఖిల్ ప్రస్తుతం అయ్యప్ప దీక్షలో ఉన్నారు. మాలలో ఉండగా.. సెలబ్రిటీలైనా సరే కొంతమంది సినిమాలు చూడరు అని కొంతమంది అంటుంటారు.

కానీ ప్రొఫెషన్ అదే అయినప్పుడు సినిమాలు చూడకుండా ఎలా ఉంటారు అని కామెంట్లు చేస్తున్న వారు కూడా ఎక్కువ మందే ఉన్నారు. ఆ రకంగా కూడా అఖిల్ చర్చల్లో నిలిచారు. ఇక ‘ఏ.ఎం.బి మాల్’ లో అఖిల్ ‘యానిమల్’ సినిమాకి వెళ్తుండగా తీసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇందులో అఖిల్ (Akhil) కాళ్లకు చెప్పులు లేకుండా మాల్ లోపలికి వెళ్లొస్తున్న విజువల్స్ ను మనం చూడవచ్చు. మీరు కూడా ఓ లుక్కేయండి :

https://twitter.com/telugufilmnagar/status/1730598878532264143?s=46&t=HmD7ymNVDZzGib7VTPdfmg

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags