సంక్రాంతి రోజే సిద్ధం కానున్న అఖిల్
- January 5, 2017 / 11:18 AM ISTByFilmy Focus
బడా హీరోలు తమ చిత్రాలతో ఈ సంక్రాంతికి వేడి పుట్టిస్తుంటే కొత్తగా అఖిల్ ఏమి చేయబోతున్నాడు? అని కంగారు పడకండి. అక్కినేని ప్రిన్స్ ని రీలాంచ్ చేయడానికి నాగ్ సంక్రాంతిని ఎంచుకున్నారు. పెద్ద పండుగ నాడు తన చిన్న కొడుకు హీరోగా రెండో చిత్రాన్ని ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. అక్కినేని ఫ్యామిలీకి మనం వంటి అద్భుత చిత్రాన్ని అందించిన డైరక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అఖిల్ మూవీ ఓకే చేసినసంగతి తెలిసిందే. అఖిల్ ఎంగేజ్ మెంట్ పనుల్లో బిజీ ఉండడంతో ఈ చిత్రం మొదలుకావడం ఆలస్యం అయింది. ఆ శుభకార్యం పూర్తికావడంతో అఖిల్ సినిమాపై దృష్టిపెట్టాడు. పెళ్లి జరిగే లోపున చిత్రం షూటింగ్ పూర్తి చేయాలనీ భావిస్తున్నారు.
ఈ మూవీ ముహూర్తపు షాట్ ని సంక్రాంతి రోజున చిత్రీకరించేందుకు డిసైడ్ అయ్యారు. మేఘ ఆకాష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని నాగార్జున సొంత బ్యానర్లో నిర్మిస్తున్నారు. అఖిల్ మొదటి చిత్రం నిరాశ పరచడంతో రెండో సినిమా ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో అందరూ శ్రమిస్తున్నట్లు తెలిసింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













