అఖిల్ హీరోగా తెరకెక్కిన ఏజెంట్ మూవీ భారీ అంచనాలతో థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ నెల 28వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. సమంత పుట్టినరోజున విడుదల కానున్న ఈ సినిమా కోసం 70 కోట్ల రూపాయల నుంచి 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చైందని సమాచారం. నిర్మాత అనిల్ సుంకర ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించారు.
మరోవైపు అఖిల్ కెరీర్ లో ఇప్పటివరకు 30 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించిన సినిమా ఏదీ లేదు. అయితే ఏజెంట్ మూవీ తెలుగు రాష్ట్రాల హక్కులతో పాటు కర్ణాటక హక్కులు 34 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. విశాఖకు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లలో ఒకరైన గాయత్రీ ఫిల్మ్స్ సతీష్ ఈ హక్కులను కొనుగోలు చేశారని బోగట్టా. జీఎస్టీ కాకుండా హక్కులను అమ్మడం నిర్మాతకు ఒక విధంగా ప్లస్ అని చెప్పవచ్చు. ఏజెంట్ మూవీ నాన్ థియేట్రికల్ హక్కులు కూడా భారీ మొత్తానికే అమ్ముడయ్యాయి.
అయితే మరీ భారీ బడ్జెట్ తో తెరకెక్కడంతో లాభాలు లేకుండానే ఈ సినిమా రిలీజవుతోంది. ఏప్రిల్ 28వ తేదీన విడుదలైన సినిమాలలో మెజారిటీ సినిమాలు రికార్డులు క్రియేట్ చేసిన నేపథ్యంలో ఏజెంట్ మూవీ కూడా ఆ సెంటిమెంట్ ప్రకారం సూపర్ హిట్ గా నిలుస్తుందేమో చూడాల్సి ఉంది. ఏజెంట్ మూవీ రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానుండగా అఖిల్ తర్వాత ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.
నాగ్, అఖిల్ కాంబినేషన్ లో ఒక మల్టీస్టారర్ రానుందని వినిపిస్తుండగా ఈ వార్తల్లో నిజానిజాలకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. ఏజెంట్ సినిమాతో అఖిల్ కోరుకున్న సక్సెస్ దక్కుతుందని ఈ సినిమా అఖిల్ కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.