Mammootty: రుచి, వాసన పోయాయి.. ఆరోగ్యంపై తొలిసారి ఓపెన్ అయిన స్టార్ హీరో
- February 19, 2026 / 12:20 PM ISTByFilmy Focus Desk
ప్రముఖ నటుడు మమ్ముట్టి కొన్ని నెలల క్రితం తీవ్ర అనారోగ్యం పాలైన విషయం తెలిసిందే. అప్పుడు ఏమైంది, ఏం జరిగింది అనే విషయం చెప్పలేదు కానీ.. హెల్త్ ఇష్యూస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి అని సన్నిహితులు చేసిన కొన్ని పనులు, పూజలు చూస్తే అర్థమైంది. ఈ విషయంలో తొలిసారి మమ్ముట్టినే స్పందించారు. కొన్నింటిని కోల్పోయినప్పుడే వాటి విలువ తెలుస్తుందని అంటూ తన అప్పటి పరిస్థితి గురించి చెప్పుకొచ్చారు మమ్ముట్టి. ఆయన మాటలు విన్న ఫ్యాన్స్ మమ్ముక్కకి ఎంత కష్టం వచ్చింది అని అనుకుంటున్నారు.
Mammootty
అనారోగ్య సమస్యల కారణంగా గతేడాది సినిమాల నుండి విరామం ప్రకటించారు. దాని గురించి మాట్లాడుతూ నేను చాలా కాలం రుచి, వాసన చూసే శక్తిని కోల్పోయాను. ఇప్పుడిప్పుడే ఇంద్రియ జ్ఞానాన్ని తిరిగి పొందుతున్నాను. ఈ సమస్య కారణంగా షూటింగ్‌లకు దూరంగా ఉన్నాను. ఆ ఖాళీ సమయంలో ఎన్నో విషయాల్ని తెలుసుకున్నాను. కానీ ఇలాంటి సామర్థ్యాలను కోల్పోయినప్పుడే వాటి ప్రాధాన్యత అర్థమవుతుంది. ముఖ్యంగా వినికిడి శక్తి లేని వారి బాధ వర్ణనాతీతం అని ఆయన పరిస్థితి చెప్పుకొచ్చారు.
ఎవరైనా గట్టిగా లేదా పెద్దగా మాట్లాడినప్పుడు చిన్నగా మాట్లాడమని అడుగుతాం. వినగలుగుతున్నాం కాబట్టి వాళ్లతో అలా చెప్పాం. అసలు వినలేని వాళ్లు ఏమీ రియాక్ట్ కాలేరు. ఎవరు ఎలా మాట్లాడినా వారికి ఏమీ తేడా కనిపించదు. వినగలగడం ఓ వరం అని కూడా చెప్పుకొచ్చారాయన. తన నాలుగు నెలల గ్యాప్ ముగిస్తూ ఇటీవల తిరిగి షూటింగ్‌ల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్న ‘పేట్రియాట్’ సినిమాలో నటిస్తున్నారు. దీంతో పాటు ధనుష్ హీరోగా రాజ్ కుమార్ పెరియస్వామి రూపొందిస్తున్న సినిమాలో కూడా నటిస్తున్నారు.











