అక్కినేని అఖిల్ (Akhil Akkineni) కెరీర్ విషయంలో ఎన్నో ఊహాగానాలు, విమర్శలు ఉన్నప్పటికీ… ఇప్పుడు అతను ఫైనల్‌గా సెటిల్ కావడానికి అసలైన ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. ‘ఏజెంట్’ (Agent) ఫెయిల్యూర్ తర్వాత ఊహించని వెనకడుగు వేసిన అఖిల్, అప్పటి నుంచి శాంతంగా ఉండిపోయాడు. అయితే ఇప్పుడు మళ్లీ మూడు క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకెళ్లేందుకు రెడీ అయ్యాడు. ఫ్యాన్స్ కూడా ఈసారి అయన గేమ్ మార్చుతాడని నమ్ముతున్నారు. ఇప్పటికే అఖిల్ నటించనున్న రెండు ప్రాజెక్ట్‌లకు సంబంధించి ప్రకటనలు ఏప్రిల్ 8న వస్తున్నాయి.
మొదటగా, ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) దర్శకుడు మురళీ కిఫోర్ తెరకెక్కించనున్న యూత్ బేస్డ్ మూవీతో అఖిల్ కొత్త షేడ్స్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమాకు ‘లెనిన్’ అనే టైటిల్‌ను ఫైనల్ చేసినట్లు టాక్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుండడం, అందులో మసాలా కంటే మెసేజ్ ఉండే కథ తీసుకున్నారన్నది హైప్ పెంచుతోంది. ఇంకొక ప్రాజెక్ట్ యువీ క్రియేషన్స్ బ్యానర్ లో వస్తోంది.
పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో డిజైన్ చేసిన ఈ కథను అనిల్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఏప్రిల్ 8నే రానుందని సమాచారం. ఈ రెండింటికీ సంబంధించి కథలు, లుక్స్, ట్రీట్మెంట్ అంతా అఖిల్ మార్క్‌ని మార్చేలా ఉంటాయని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. దీని తర్వాత అఖిల్, ‘సామజవరగమన’ సినిమాకు రచయితగా వర్క్ చేసిన నందు దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్‌కి కమిట్ అయ్యాడు.
శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్న ఈ సినిమా కూడా ఎమోషనల్ గా డీప్ కంటెంట్ కలిగిన కథ అని తెలుస్తోంది. ఇలా మూడు వేరే వేరే జానర్లలో అఖిల్ ప్రయత్నించాలన్న డెసిషన్ వరుస ఫెయిల్యూర్లకు దూరంగా వెళ్లే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అఖిల్ లుక్స్, ఫిజికల్ ప్రెజెన్స్, స్క్రీన్ కమాండింగ్ అన్నీ టాప్ లెవెల్లో ఉన్నప్పటికీ… కంటెంట్ లో జాగ్రత్త పడకపోవడం వల్లనే ఫలితాలు రాలేదు. కానీ ఇప్పుడు కథలపై పూర్తిగా కేర్ తీసుకుంటూ వెళ్లే యాటిట్యూడ్ అఖిల్ ప్లానింగ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.