కెమెరా ముందు అకీరా సిగ్గుపడ్డాడు : రేణు దేశాయ్
- September 3, 2016 / 06:36 AM ISTByFilmy Focus
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా తొలిసారి కెమెరా ముందుకు వచ్చినప్పుడు బయపడలేదని, సిగ్గు పడినట్లు తల్లి రేణు దేశాయ్ చెప్పింది. 2014లో రేణు దేశాయ్ ‘ఇష్క్ వాలా లవ్’ అనే మరాఠి చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించింది. ఈ చిత్రంలో అకీరా ఓ పాత్రను పోషించాడు. ఈ సినిమాని తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేయనున్నారు. ఈటీవీ ఛానల్లో సెప్టెంబరు 4న ఈ చిత్రాన్ని ప్రసారం చేయనున్నారు.
ఈ సందర్భంగా ఆమె శనివారం అభిమానులతో సోషల్ మీడియా వేదికగా మాట్లాడాడు. వారు అకీరా వెండి తెర ఎంట్రీ పై అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. “ఇష్క్ వాలా లవ్ లో అకీరా ది చాలా చిన్న రోల్. మూడు నిముషాలు మాత్రమే కనిపిస్తాడు. అయినా చాలా క్యూట్ గా కనిపిస్తాడు. తెలుగు, మరాఠిలో తన పాత్రకి సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు. అకిరాని డైరక్ట్ చేయడం చాలా సంతోషంగా ఫీలయ్యాను. ఈ చిత్రం మొదటి కాపీ పవన్ చూసారు. చాలా ఆనందించారు” అని చెప్పారు. భవిష్యత్తులో అకిరా హీరో అవుతాడా? వేరే ఫీల్డ్ ఎంచుకుంటాడా ? అనే ప్రశ్నకు సమాధానంగా అకీరా మంచి ప్రొఫిషన్ ఏది ఎంచుకున్నా అడ్డు చెప్పనని రేణు వివరించారు.
Not afraid but little siggu paddadu🙈 https://t.co/eamCK4TULT
— renu (@renuudesai) September 3, 2016
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

















