అఖిల్ ‘బ్రదర్’ అంటే కార్తికేయ ఇచ్చిన రిప్లై చూసి షాక్ అవుతున్న అక్కినేని ఫ్యాన్స్!..

‘ఆర్ఆర్ఆర్’ మూవీ ‘బెెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలో ‘నాటు నాటు’ పాటకు ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.. తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసిన స్వరవాణి ఎమ్.ఎమ్.కీరవాణి, అచ్చతెలుగు పదాలతో పాటకు అందాన్ని తీసుకొచ్చిన గీత రచయిత చంద్రబోస్ వేదిక మీద అవార్డులందుకున్నారు.. తెలుగు సినిమా ఆస్కార్ వేదిక నెక్కడం.. తెలుగు సినిమాకి అకాడమీ అవార్డ్ రావడం అన్నది ఎవరి ఊహకూ అందనిది.. అసలు కలలో కూడా ఊహించనిది.. అసాధ్యం అనుకున్నదాన్ని సుసాధ్యం చేసి చూపించారు దర్శకధీరుడు రాజమౌళి..

RRR ఆస్కార్ దక్కించుకున్న సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు, భారతీయులు.. సామాన్యులు, సెలబ్రిటీలు కేవలం సినీ పరిశ్రమకు చెందిన వారే కాదు యావత్ దేశమంతా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.. సినీ, రాజకీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశంసలు, అభినందనలు తెలియజేస్తున్నారు.. మూవీ టీమ్ ఇండియా వచ్చిన తర్వాత పార్లమెంట్‌లో వారిని సత్కరించాలనే ప్రతిపాదన కూడా జరిగింది.. రామ్ చరణ్, ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానుండగా న్యూఢిల్లీలో జరగబోయే ఇండియా టుడే కాన్ క్లేవ్‌లో పాల్గొనబోతున్నాడు..

ఈ ఈవెంట్‌లో ప్రధాని మోదీతో పాటు క్రికెట్ దిగ్గజం సచిన్ కూడా పాల్గొనబోతున్నారు.. ఇదిలా ఉంటే.. ట్రిపులార్ టీమ్ ఆస్కార్ సాధించిన సందర్భంగా అఖిల్ అక్కినేని కంగ్రాట్స్ చెప్తూ ట్వీట్ చేశాడు.. అందరికంటే ముందుగా కార్తికేయ పేరుని మెన్షన్ చేస్తూ.. అతిపెద్ద ఘనత సాధించినందుకు మై బ్రదర్ కార్తికేయకు బిగ్ షౌటౌట్ అంటూ తర్వాత మిగతా వారి పేర్లు పెట్టాడు.. అయితే అఖిల్ పోస్ట్‌ని ‘‘థ్యాంక్యూ రా!.. లవ్ యూ’’ అంటూ హార్ట్ సింబల్స్‌తో రీ ట్వీట్ చేశాడు కార్తికేయ..

కట్ చేస్తే.. అతని రిప్లై విషయంలో అక్కినేని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.. ‘‘అఖిల్ బ్రో అన్నాడు.. ఎంత ఫ్రెండ్ షిప్ ఉన్నా కానీ ఇలా రా అనడం ఏంటి సార్?’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. కార్తికేయ, అఖిల్ తన కంటే వయసులో చిన్నవాడు పైగా మంచి అనుబంధం ఉన్న కారణంగానే అలా ప్రేమతో రా అని సంబోధించి ఉండవచ్చు అని మరికొందరు అంటున్నారు..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus