ఆ వ్యాఖ్యల గురించి బాలకృష్ణ వివరణ ఇస్తారా?

స్టార్ హీరో బాలకృష్ణ కావాలని అన్నారో పొరపాటున అన్నారో తెలీదు కానీ ఆయన అక్కినేని తొక్కినేని అంటూ చేసిన కామెంట్లు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు అక్కినేని అభిమానులను ఎంతగానో హర్ట్ చేశాయి. స్టార్ హీరో అయిన బాలయ్య ఈ తరహా కామెంట్లు చేయడం తగదని సాధారణ అభిమానులు సైతం చెబుతున్నారు. బాలయ్య క్షమాపణలు చెప్పాలని అక్కినేని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సర్వేశ్వరరావు మాట్లాడుతూ

బాలయ్య స్టేజ్ పై ఏం మాట్లాడతాడో కూడా తెలియదని మహా నటుల గురించి జోక్ గా మాట్లాడాలని అనుకోవడం చాలా తప్పు అని అన్నారు. గతంలో బాలయ్య చాలా సందర్భాల్లో ఏఎన్నార్ తనకు బాబాయ్ లాంటి వ్యక్తి అని చెప్పారని సర్వేశ్వరరావు గుర్తు చేశారు. ఏఎన్నార్ వర్ధంతి రోజున వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏముందని ఆయన చెప్పుకొచ్చారు. ఏఎన్నార్ పై బాలయ్యకు నిజంగా అభిమానం ఉంటే ఒక నిమిషం మౌనం పాటిస్తే బాగుండేదని సర్వేశ్వరరావు తెలిపారు.

నాగార్జున నందమూరి హీరోల గురించి ఎప్పుడైనా మాట్లాడారా? అని ఆయన ప్రశ్నించారు. జీవించి ఉన్నంత కాలం ఏఎన్నార్ నటించారని ఏఎన్నార్ ను కించపరిచేలా మాట్లాడటం అంటే టాలీవుడ్ ఇండస్ట్రీని అవమానించినట్టేనని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. బాలయ్య చేసిన కామెంట్ల గురించి చైతన్య, అఖిల్ స్పందించి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. బాలయ్య క్షమాపణలు చెప్పకపోయినా వివరణ ఇస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి మూవీ షూట్ లో పాల్గొంటున్నారు. బాలయ్య వివాదాలకు దూరంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలయ్య అనిల్ కాంబో మూవీ 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. పటాస్ తో నందమూరి హీరోకు హిట్టిచ్చిన అనిల్ రావిపూడి ఈ సినిమాతో మరో హిట్ ఇస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus