Akkineni Heroes: ఆ విషయంలో అక్కినేని హీరోలు సేమ్ టు సేమ్.. ఎవ్వరూ తగ్గట్లేదుగా!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని హీరోలకు ఏ స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని హీరోల సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే ఏ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో సోగ్గాడే చిన్నినాయన (Soggade Chinni Nayana) , రారండోయ్ వేడుక చూద్దాం (Rarandoi Veduka Chudham) , మజిలీ (Majili) , బంగార్రాజు (Bangarraju) మరికొన్ని సినిమాలు ప్రూవ్ చేశాయి. అక్కినేని హీరోలకు పాన్ ఇండియా స్థాయిలో హిట్లు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే అక్కినేని హీరోల గొడుగు సెంటిమెంట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

ఈ ముగ్గురు హీరోలు తమ సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో గొడుగు పట్టుకుని కనిపించడం హాట్ టాపిక్ అవుతోంది. ఏజెంట్ (Agent) పోస్టర్ లో అఖిల్ (Akhil Akkineni) గొడుగు పట్టుకుని కనిపించగా దూత (Dhootha) పోస్టర్ లో నాగచైతన్య (Naga Chaitanya) గొడుగు పట్టుకుని కనిపించారు. తాజాగా విడుదలైన కుబేర పోస్టర్ లో నాగ్ సైతం గొడుగుతో దర్శనమివ్వడం గమనార్హం. ఈ ముగ్గురు హీరోలు సేమ్ టు సేమ్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ముగ్గురు హీరోలు ఒకవైపు క్లాస్, మరోవైపు మాస్ సినిమాలలో నటిస్తూ వరుసగా సినిమాలు చేసే విషయంలో మాత్రం ఎవ్వరూ తగ్గట్లేదనే చెప్పాలి.

త్వరలో అఖిల్ కొత్త సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ రానున్నాయని సమాచారం అందుతోంది. నాగార్జున వరుస సినిమాలతో బిజీగా ఉండగా నాగచైతన్య మాత్రం తండేల్ (Thandel) సినిమాతో బిజీగా ఉండటం గమనార్హం. అక్కినేని హీరోల రెమ్యునరేషన్లు పరిమితంగానే ఉన్నాయని సమాచారం అందుతోంది. అక్కినేని హీరోలు వరుస విజయాలు సాధించి కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

అక్కినేని హీరోలు యంగ్, టాలెంటెడ్ డైరెక్టర్లకు ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారు. నాగార్జున తన సినీ కెరీర్ లో ఎంతోమంది కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వగా రాబోయే రోజుల్లో మరి కొందరు డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. అక్కినేని హీరోల నుంచి మరిన్ని మల్టీస్టారర్లు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. నాగ్ విజయ్ బిన్నీ కాంబోలో మరో సినిమా రానుందని తెలుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus