మల్టీస్టారర్ ఇది టాలీవుడ్‌కి పాత మాట అయిపోయింది. తొలుత చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపించిన ఈ మాట ఆ తర్వాత రెగ్యులర్ కాన్సెప్ట్ అయిపోయింది. దీంతో మల్టీస్టారర్ ఆ.. ఓకే అనే పరిస్థితి వచ్చేసింది. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్’ లాంటి మల్టీస్టారర్‌లు ఆసక్తిరేపేవే. తాజాగా మల్టీస్టారర్‌ల మాట మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈసారి కారణం నాగార్జున. కొడుకులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా… తనదైన జోరుతో దూసుకుపోతున్నాడు కింగ్. ఇటీవల మల్టీస్టారర్ గురించి అడిగితే… రెండు కబుర్లు చెప్పాడు.
ఫ్యామిలీ మల్టీస్టారర్ అంటే మనకు ఠక్కున గుర్తొచ్చేది ‘మనం’. మొత్తం కుటుంబం అందులో కనిపించి అలరించారు. ఆ తర్వాత అలాంటి బొమ్మ కోసం అభిమానులు, తెలుగు సినిమా ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. దీంతో నాగ్ చాలా రోజులకు దొరికేసరికి అడిగేశారు. అయితే ఆయన ఒకటి కాదు ఏకంగా రెండు మల్టీస్టారర్‌లు ఉంటాయని చెప్పి సర్‌ప్రైజ్ చేశాడు. అయితే అందులోనూ చిన్న నిరాశమిగిచ్చాడు. కారణం ముగ్గురు అక్కినేని హీరోలు కాకుండా.. ఇద్దరేసి ఒకసారి కనిపించబోతున్నాడు. అంటే ఫుల్ ఫ్యామిలీ మల్టీస్టారర్ కాదన్నమాట.
దీంతో అభిమానులు మరోసారి నిరాశకు లోనయ్యారనే చెప్పాలి. ముగ్గురినీ కలిపి చూద్దాం అంటే… ఇలా ఎందుకు చేశారా అని అనుకుంటున్నారు. కొందరైతే పోనీలెండి ఇద్దరినైనా కలిసి ఒకే సారి తెరమీద చూస్తాం అని సంబరపడుతున్నారు. నాగార్జున ఇప్పటికైనా ఈ విషయం గ్రహించి మొత్తం ఫ్యామిలీ మల్టీస్టారర్ తీసుకొస్తారేమో చూడాలి.