వ్యవహరించే నాగార్జున ఇప్పటివరకూ ఏ ఒక్క రాజకీయ పార్టీకి తన మద్ధత్తును ప్రకటించలేదు. కాకపోతే.. ఎవరు ప్రభుత్వాన్ని ఫార్మ్ చేస్తే వాళ్ళతో స్నేహంగా మెలుగుతుంటాడు నాగార్జున. కానీ.. వై.ఎస్.ఆర్.సి.పి పార్టీతో మాత్రం నాగార్జున కాస్త క్లోజ్ రిలేషన్ షిప్ ఉందని వినికిడి ఎప్పట్నుంచో ఉంది. అయితే.. ఈ పరిచయం త్వరలోనే నాగార్జునను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకోస్తున్నట్లు సమాచారం.
గత నాలుగైదేళ్లుగా వరుసబెట్టి ఏడాదికి రెండు సినిమాలు చేసిన నాగార్జున ఈ ఏడాది మాత్రం ఇంకా ఏ ఒక్క సినిమాను అఫీషియల్ గా ఫైనలైజ్ చేయలేదు. ఈ గ్యాప్ ఎందుకా అని అందరూ ఆలోచిస్తున్న తరుణంలో.. నాగార్జున వచ్చే ఆంధ్రా ఎలక్షన్స్ లో గుంటూరు నుంచి ఏం.పీగా పోటీ చేస్తున్నారు అని టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియదు కానీ.. నాగార్జున సన్నిహితులు మాత్రం ఈ వార్త విని భయపడుతున్నారట. మరి ఏ విషయంలోనైనా చాలా జాగ్రత్తగా వ్యవహరించే నాగార్జున ఇలా ఉన్నట్లుండి రాజకీయాల్లోకి వచ్చేస్తారా అనేది తెలియాలి.