Akshay Kuma: స్టార్‌ హీరోకి మరో భంగపాటు.. ఏదీ కలసి రావడం లేదుగా!

‘ఇతర హీరోలు సినిమా కోసం సిద్ధమయ్యే సమయంలో.. అక్షయ్‌ కుమార్‌ ఏకంగా సినిమా చేసి రిలీజ్‌ చేసేస్తుంటాడు’.. కొన్నాళ్ల క్రితం అక్షయ్‌ గురించి ఓ రియాలిటీ షోలో యాంకర్‌ చెప్పిన మాట ఇది. అప్పట్లో ఆయన సినిమాలు అలా వర్కవుట్‌ అయ్యేవి మరి. పట్టిందల్లా బంగారం అనే కాన్సెప్ట్‌లు అక్షయ్‌ ఏ సినిమా చేసిన మినిమం విజయం పక్కా. అయితే ఇప్పుడు రోజులు మారాయి, అక్షయ్‌ ఏం చేసినా కలసి రావడం లేదు.

తాజాగా ఆయన నుండి రిలీజ్‌ అయిన ‘సెల్ఫీ’ కూడా మటాష్‌ అయ్యింది. అక్షయ్‌ – ఇమ్రాన్‌ హస్మీ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘సెల్ఫీ’. మలయాళంలో సూపర్‌ విజయం అందుకున్న ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’ అనే సినిమాకు ఇది రీమేక్‌ అనే విషయం తెలిసిందే. ఈ సినిమాను అక్కడకు తీసుకెళ్లడంలో విజయం సాధించిన టీమ్‌.. సరైన విధానంలో ప్రజెంట్‌ చేయలేకపోయింది. దీంతో సినిమా ఉసూరుమనిపించింది. ముందుగా చెప్పినట్లు సినిమాను, పాత్రలను తీసుకున్నా.. అందులోని సోల్‌ను మిస్‌ అయ్యారు అని చెబుతున్నారు విశ్లేషకులు.

‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’ సినిమాలో చూస్తే ఇద్దరు ప్రధాన పాత్రధారుల మధ్య సంఘర్షణను బాగా చూపిస్తారు. పాత్రల తీరు, వారి మధ్య నడిచే ఎమోషనల్‌ డ్రామా.. హిందీ వెర్షన్‌లో లేదని అంటున్నారు. సినిమా ఫ్లాప్‌ అవ్వడానికి ఇదే కారణం అని కూడా అంటున్నారు. ఇక వసూళ్ల సంగతి చూస్తే.. తొలి రోజు రూ.మూడు కోట్లు మాత్రమే వచ్చాయంటున్నారు. ఈ సినిమా కంటే ‘అల వైకుంఠపురములో’ సినిమా రీమేక్‌ ‘షెహజాదా’కే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. ఆ సినిమా తొలి రోజు రూ. 6 కోట్ల వసూలు చేసింది మరి.

అలా గత పదేళ్లలో అక్షయ్ కుమార్‌ వరస్ట్ ఓపెనింగ్ ఈ సినిమా అని చెప్పొచ్చు. అక్షయ్ కుమార్ రీసెంట్‌ సినిమా ‘రామ్ సేతు’ ఫస్ట్ డే వసూళ్లు రూ.15.25 కోట్లు. ఆ తర్వాత వచ్చిన ‘రక్షా బంధన్’కు రూ. 8.2 కోట్లు. ఇక ఫస్ట్ డే రూ.పది కోట్ల కంటే తక్కువ కలెక్షన్స్ సాధించిన అక్షయ్ కుమార్ సినిమాలు చూస్తే… ‘బెల్ బాటమ్’ సినిమా ఉంటుంది. ఆ సినిమాకు ఓపెనింగ్స్ రూ.2.75 కోట్లు మాత్రమే. అన్నట్లు అక్షయ్‌కి స్ట్రెయిట్‌ హిందీ సినిమా కంటే రీమేక్‌కే తక్కువ డబ్బులు వస్తున్నాయని చెప్పొచ్చు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus