Akshay Kumar: రీమేక్‌ సినిమాకు అంత వచ్చిందంటే.. సూపర్‌ కదా!

బాలీవుడ్‌ పరిస్థితి ఏం బాలేదు, బాలీవుడ్‌ స్టార్‌ హీరోల పరిస్థితి ఇంకా బాలేదు. గత కొద్ది రోజులుగా ఈ మాటలు తెగ వింటున్నాం. అక్కడ ఏ సినిమాలు చేసినా సరైన వసూళ్లు రావడం లేదు. స్టార్‌ హీరోల సినిమాలకైతే కంటెంట్‌ క్వాలిటీ ఓ సమస్య అయితే, ‘బాయ్‌కాట్‌’ అంటూ ఓ బ్యాచ్‌ గోల చేస్తోంది. దీంతో ఇబ్బందులు తప్పడం లేదు. అయితే ఇదంతా బాలీవుడ్‌ సినిమాల ఓటీటీ డీల్స్‌ విషయంలో ఏ మాత్రం ప్రభావం చూపించడం లేదా? అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు.

ఓటీటీ డీల్స్‌ విషయంలో ఇటీవల వినిపిస్తున్న వార్తలు, కుదిరిన డీల్స్‌ చూస్తుంటే బాలీవుడ్‌ సమస్య కేవలం థియేటర్ల వరకే అనిపించక మానదు. బాలీవుడ్‌లో ఇటీవల కుదిరిన ఓటీటీ డీల్‌ అంటే అక్షయ్‌ కుమార్‌ ‘కట్‌ పుత్లీ’ సినిమానే. ఈ సినిమాను డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ఏకంగా రూ. 130 కోట్లకు కైవసం చేసుకుంది అని చెబుతున్నారు. దీంతో అక్షయ్‌ సినిమాకు ఇంత మొత్తంలో డబ్బులు రావడమా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదెలా సాధ్యం అనే వాళ్లూ ఉన్నారు.

ఎందుకంటే అక్షయ్‌ రీసెంట్ ట్రాక్‌ రికార్డు ఏం బాలేదు. వరుసగా ‘బచ్చన్‌ పాండే’, ‘పృథ్వీరాజ్‌’, ‘రక్షా బంధన్‌’ బాక్సాఫీసు దగ్గర దారుణంగా పరాజయం పాలయ్యాయి. బాక్సాఫీసు దగ్గర రూ. 100 కోట్ల లెక్కకే ఇవి చాలా దూరంగా నిలిచాయి. అలాంటి సమయంలో అక్షయ్ సినిమాకి ఓటీటీలో రూ. 130 కోట్లు రావడం అంటే పెద్ద విషయమే. అందులోనూ ఓ రీమేక్‌ సినిమాకు ఇంత ఇస్తున్నారు అంటే ఇంకా ఆసక్తికరం. ‘కట్‌ పుత్లీ’ అంటే తెలుగులో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ – అనుపమ పరమేశ్వరన్‌ నటించిన ‘రాక్షసుడు’ సినిమాకు రీమేక్‌.

ఇక ఈ సినిమా శాటిలైట్‌ హక్కులు రూ. 50 కోట్లు పలికాయి అని చెబుతున్నారు. ఈ లెక్కన ఈ సినిమాకు డిజిటల్‌ రైట్స్‌గా రూ. 180 కోట్లు వచ్చేశాయి. ఒకవేళ అక్షయ్‌ ఈ బిజినెసే బాగుంది అని మొత్తం తన సినిమాలన్నీ ఓటీటీలకు ఇచ్చేస్తే.. ఇబ్బంది తప్పదు. థియేటర్లలో సినిమాలు ఆడితేనే ఆ రంగం బాగుపడుతుంది. అలా కాకుండా అన్నీ ఓటీటీకి అంటే కష్టమే. అయితే లేనిపోని ఆరోపణలతో బాయ్‌కాట్‌ చేసే బ్యాచ్‌ ఇలానే కొనసాగితే అందరూ హీరోల ఈ దిశగా ఆలోచించే అవకాశం ఉంది. అప్పుడు ఓటీటీలను బ్యాన్‌ చేయాలి అంటారేమో ఆ బ్యాచ్‌.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus