అక్షయ్ సినిమాకు అంత దారుణంగా కలెక్షన్లు వచ్చాయా?

బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అక్షయ్ కుమార్ ప్రేక్షకుల్లో ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. తాజాగా ఆయన నటించిన సెల్ఫీ సినిమా థియేటర్లలో విడుదలైంది. మలాయళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. సెల్ఫీ సినిమాకు కరణ్ జోహార్ నిర్మాత కాగా రాజ్ మెహతా దర్శకత్వం వహించడం గమనార్హం.

ఈ సినిమా తొలిరోజు కేవలం 10 లక్షల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది. అక్షయ్ కుమార్ అభిమానులను ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. అక్షయ్ కుమార్ మూవీ కలెక్షన్ల గురించి ఒక వెబ్ సైట్ స్పందిస్తూ మేల్ వెర్షన్ ఆఫ్ కంగనా అని పేర్కొనడం గమనార్హం. ఈ వార్త గురించి కంగనా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. సెల్ఫీ మూవీ ఫెయిల్యూర్ వార్తల గురించి నేను చూస్తున్న సమయంలో ఈ వార్త నా కంట పడిందని అక్షయ్ ఈజ్ ఏ మేల్ వెర్షన్ ఆఫ్ కంగనా అంటూ ఈ వార్త నన్ను ఉద్దేశించి రాశారని ఆమె చెప్పుకొచ్చారు.

ఆ సినిమా ఫ్లాప్ కావడం నా తప్పా అని ఆమె ప్రశ్నించారు. సెల్ఫీ మూవీకి అతి కష్టం మీద 10 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయని నన్ను వేధింపులకు గురి చేసినట్టు కరణ్ జోహార్ ను తిట్టడం లేదా అవమానించడం మీడియా మరిచిపోయిందని కంగనా అన్నారు. కంగనా చేసిన కామెంట్ల గురించి నెటిజన్ల నుంచి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

కంగనా రనౌత్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కంగనా, అక్షయ్ కుమార్ వేర్వేరుగా నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుండటంతో కంగనా ఈ కామెంట్లు చేయడం గమనార్హం.బాలీవుడ్ సినిమాలలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోవడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus