Alekhya Reddy: తారకరత్నను తలుచుకొని ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన అలేఖ్య!

నందమూరి తారకరత్న గుండెపోటుకి గురై ఫిబ్రవరి 18వ తేదీ మరణించిన సంగతి మనకు తెలిసిందే. జనవరి 27వ తేదీ గుండెపోటుకు గురైనటువంటి ఈయన దాదాపు 23 రోజులపాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ తుది శ్వాస విడిచారు. ఈ విధంగా తారకరత్న మరణించిన సమయంలో అలేఖ్యను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి ఉన్నఫలంగా దూరం అవడంతో అలేఖ్య కుప్పకూలిపోయారు. ప్రేమించిన వ్యక్తి కోసం కుటుంబ సభ్యులను ఎదిరించి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్నటువంటి అలేఖ్య రెడ్డి ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉన్న సమయంలోనే తారకరత్న మరణ వార్త తనని ఎంతగానో కృంగతీసింది.

ఇలా తారకరత్న మరణించడంతో ఈమె (Alekhya Reddy) తరచూ తారకరత్న పై తనకు ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఎంతో ఎమోషనల్ అవుతూ పోస్టులు చేశారు. ఈ పోస్టులు చూసినటువంటి అభిమానులు కూడా కంటతడి పెట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మరోసారి ఈమె తన భర్త తారకరత్నను తలుచుకొని ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అలేఖ్య రెడ్డి తారకరత్నల కవల పిల్లలు అయినటువంటి తాన్యారామ్ , రేయా ల పుట్టినరోజు.

దీంతో బాగోద్వేగమైన ఒక పోస్టును షేర్ చేశారు.తన పెద్ద కుమార్తె తన తండ్రి ఫోటోకి పువ్వులు పెడుతూ ఉండగా తన ఇద్దరు పిల్లలు తన అక్కకు సహాయం చేస్తూ ఉన్నటువంటి ఫోటోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇలాంటి ఆనంద సమయంలో మీరు లేరు కానీ పిల్లల ముఖంలో నువ్వు ఎప్పుడు ఉంటావు. వర్షం కురిసే రోజు ఇంద్రధనస్సు కంటే నువ్వే చాలా అందంగా ఉంటావు. ప్రొద్దుతిరుగుడు పువ్వు కంటే నువ్వే చలాకిగా ఉంటావు.

మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాము.. మా ఆనందాన్ని రెట్టింపు చేయాలని, ప్రేమను రెట్టింపు చేయాలని కోరుకుంటున్నాము. అద్భుతమైన మన కవలలకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ తన కవల పిల్లల పుట్టిన రోజు సందర్భంగా తారకరత్నను తలుచుకొని అలేఖ్య చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus