Ali,Pawan Kalyan: పవన్ తో విభేదాలు గురించి క్లారిటీ ఇచ్చిన అలీ.. వారి వల్లే అంటూ కామెంట్స్!

వెండితెరపై కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆలీ ప్రస్తుతం కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో మాత్రమే నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. అయితే ఈయన పలు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోని ఏపీ ప్రభుత్వం తాజాగా ఆలీకి ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా కూడా పదవి అప్ప చెప్పారు. ఇలా సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఉన్న సమయంలో అలికి పవన్ కళ్యాణ్ కు మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఉంది.

అలీ రాజకీయాలలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కి కాకుండా సీఎం జగన్ కి మద్దతు తెలపడంతో వీరిద్దరి మధ్య చిన్నపాటి మనస్పర్ధలు వచ్చాయని అందుకే వీరి మధ్య గ్యాప్ కూడా ఏర్పడింది అంటూ వార్తలు షికార్లు చేశాయి.ఈ క్రమంలోనే ఈ విభేదాల కారణంగానే పవన్ కళ్యాణ్ అలీ కుమార్తె వివాహానికి కూడా హాజరు కాలేదని వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా అలీతో సరదాగా కార్యక్రమంలో భాగంగా సుమా హోస్టుగా వ్యవహరించగా ఈ కార్యక్రమానికి రావడంతో ఈ కార్యక్రమంలో భాగంగా సుమ ఆలీని ఎన్నో విషయాల గురించి ప్రశ్నించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ కు మీకు మధ్య గ్యాప్ రావడానికి కారణం ఏంటి అనే ప్రశ్న కూడా వేశారు. ఈ ప్రశ్నకు అలీ సమాధానం చెబుతూ మా ఇద్దరి మధ్య ఎలాంటి క్యాప్ రాలేదని కొందరు క్రియేట్ చేశారని సమాధానం చెప్పారు. ఇక వీరిద్దరి మధ్య గ్యాప్ క్రియేట్ చేసిన వ్యక్తులు ఎవరు అనే విషయం గురించి కూడా ఈయన క్లారిటీ ఇచ్చారు తన కుమార్తె వివాహానికి పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించాలని తన సినిమా షూటింగ్ జరుగుతున్న లోకేషన్ కి వెళ్ళాను. అప్పుడే తనని కలవడానికి వేరే వాళ్లు కూడా వచ్చారు.

పవన్ కళ్యాణ్ వాళ్లని వెయిట్ చేయమని చెప్పి నా వద్దకు వచ్చారు ఇద్దరం కలిసి సుమారు 15 నిమిషాల వరకు మాట్లాడుకున్నాం. అయితే ఈ విషయం వేరే వాళ్ళకి అలాగే వెబ్సైట్ వాళ్ళకి తెలియదు ఏదో ఒకటి రాస్తే ఫేమస్ అవుతాం అన్న ఉద్దేశంతో మా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని క్రియేట్ చేశారు అంటూ ఈ సందర్భంగా అలీ సమాధానం చెప్పారు. మా ఇద్దరి మధ్య వెబ్సైట్ వాళ్లు ఇలాంటి వార్తలు రాసి గ్యాప్ క్రియేట్ చేశారు తప్ప మాకు ఎలాంటి మనస్పర్ధలు లేవని క్లారిటీ ఇచ్చారు.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus