Ali: తండ్రి కలని నెరవేర్చిన అలీ కూతురు.. నెటిజెన్ల నుండీ ప్రశంసలు..!

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టిన అలీ అనతి కాలంలోనే పాపులర్ అయ్యి,అటు తర్వాత వరుస అవకాశాలను దక్కించుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఓ పక్క కమెడియన్ గా చేస్తూనే మరోపక్క హీరోగా కూడా చేసాడు అలీ. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూనే మరోపక్క టీవీ వ్యాఖ్యాతగా బుల్లితెర పై కూడా సందడి చేస్తున్నాడు. ‘సీతాకోకచిలుక’ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అలీ….1100 కి పైగా సినిమాల్లో నటించారు.

తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా ఆయన నటించారు. అకాడమీ ఆఫ్ యూనివర్సల్ పీస్ వారు ఆలీకి గౌరవ డాక్టరేట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అలీ తండ్రి మహమ్మద్ బాషా పేరుపై చారిటబుల్ ట్రస్ట్ ను కూడా స్థాపించి ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.అలీ తమ్ముడు ఖయ్యూం కూడా నటుడే అన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. అలీ మంచి ఫ్యామిలీ మెన్. ఏమాత్రం సమయం దొరికినా తన భార్యా పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయడానికి చూస్తుంటారు అలీ.

అలాగే ఈయనకి ముగ్గురు పిల్లలు.ఇద్దరు ఆడపిల్లలు కాగా ఇంకొకరు అబ్బాయి కావడం విశేషం. వాళ్ళ పేర్లు ఫాతిమా రమీజున్, మహమ్మద్ బాషా, జుబేరియా. ఇదిలా తన కూతురి ఫాతిమా గురించి ఓ గుడ్ న్యూస్ ను షేర్ చేసుకున్నాడు. విషయంలోకి వెళ్తే.. ఫాతిమా డాక్టర్ అయ్యిందట. ఇది అలీ కోరిక అని.. తన కూతురి ద్వారా అలీ కోరిక తీరినట్టు ఆనందాన్ని వ్యక్తం చేశారు అలీ. ఈ విషయం పై ఫాతిమా కూడా ఆనందం వ్యక్తం చేస్తుంది. ఈ టాపిక్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus