Alia Bhatt: జీవితంలో కొత్త విషయాలు తెలుసుకున్నా: ఆలియా

జీవితంలో ఆడపిల్లకు కొన్ని దశలు ఉంటాయి. అందులో తల్లి అయ్యాక చక్రం పరిపూర్ణం అయ్యింది అని అంటారు. అంత సీరియస్‌గా ఈ టాపిక్‌ గురించి ఇప్పుడు మాట్లాడలేం కానీ.. తల్లి అయ్యాక ఓ మహిళ జీవితంలో వచ్చే మార్పుల గురించి ఓసారి మాట్లాడుకుందాం. అంటే.. మేమేదో చెబుతాం అని కాదు. కథానాయిక ఆలియా భట్‌ చెప్పిన ముచ్చట్లే మీ దగ్గరకు తీసుకొచ్చాం. రణ్‌బీర్‌ కపూర్‌ను ఇటీవల వివాహం చేసుకున్న ఆలియా.. ఇటీవల పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది.

ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తోన్న ఆలియా.. ఇటీవల యోగా శిక్షణకు వెళ్తోంది. త్వరలో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకే ఈ ఏర్పాట్లు అంటున్నారు. అయితే తల్లయ్యాకా తన ఆలోచన తీరులో చాలా మార్పులొచ్చాయని చెప్పింది అలియా. ‘‘తల్లిగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టాక నా వ్యక్తిగత జీవితంలో భారీ మార్పులు వచ్చాయి. ఇంతకుముందు కంటే స్వేచ్ఛగా ఆలోచిస్తున్నాను’’ అని చెప్పింది. నా జీవితంలో వచ్చిన మార్పుల దృష్ట్యా.. నేను భవిష్యత్తులో ఎలాంటి సినిమాలు ఓకే చేస్తాను,

ఎలాంటి పాత్రలు ఎంచుకుంటాను అనే క్లారిటీ నాకే రావడం లేదు. నా కెరీర్‌ ఎలా ఉండబోతోంది అనే విషయంలో నేను చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాను అని మాత్రం చెప్పగలను అంటూ తన కెరీర్‌ గురించి తన ఆలోచనలను వెలిబుచ్చింది. ప్రస్తుతం ఆలియా కరణ్‌ జోహార్‌ చిత్రం ‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీతో పాటు ‘హార్ట్‌ స్టోన్‌’ అనే హాలీవుడ్‌ చిత్రంలో నటిస్తోంది. ‘ఆర్‌ఆర్ఆర్‌’తో పాన్‌ ఇండియా నాయిక అయిన ఆలియా..

ఆ తర్వాత తెలుగులో వెంటనే మరో సినిమా చేస్తుందనే వార్తలొచ్చాయి. అదే సమయంలో గర్భవతి అని తలెఇయడంతో ఆ సినిమా నుండి తప్పుకుంది. ఇప్పుడు తిరిగి యాక్టింగ్‌ షురూ చేశాక మళ్లీ తెలుగు ఆలోచన చేస్తుందేమో చూడాలి. అన్నట్లు ఆమె అప్పుడు వద్దనుకున్న సినిమా ఇంకా స్టార్ట్‌ అవ్వలేదు. ఇప్పుడు ఆమె ఓకే అంటే.. అందులోనే నటిస్తుందేమో చూడాలి.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus